Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Aug-2017 15:53:51
facebook Twitter Googleplus
Photo

చాలామంది కోట్లు సంపాదిస్తారు. కానీ అందులోంచి ఎంతో కొంత సామాజిక సేవకు ఉపయోగించేవాళ్లు కొద్దిమందే. కొంతమంది ఛారిటీ చేసినా.. దాని గురించి కొట్టుకునే డబ్బా అంతా ఇంతా కాదు. పావలా పెట్టి రూపాయి పబ్లిసిటీ కోరుకునే వాళ్లే ఎక్కువమంది. ఐతే సంపాదించిన డబ్బుతో అభాగ్యుల్ని ఆదుకుని.. అందులో నిజమైన ఆనందం పొందేవాళ్లు కొద్దిమందే ఉంటారు. అందులో హన్సిక మొత్వాని ఒకరు. ఇప్పటిదాకా ఈ అమ్మాయి ఏకంగా 32 మంది పిల్లల్ని దత్తత తీసుకోవడం విశేషం. ఆ 32 మంది పిల్లల బాగోగులన్నీ ఆమే చూస్తోంది. 32 మంది పిల్లల బాధ్యత తీసుకోవడమంటే చిన్న విషయం కాదు.

ఇద్దరు ముగ్గురు పిల్లల్ని పెంచడానికే ఈ రోజుల్లో ఎంత కష్టమవుతోందో.. ఎంత ఖర్చవుతోందో తెలిసిందే. మరీ లగ్జరీ లైఫ్ ఇచ్చేయకున్నప్పటికీ.. ఈ 32 మంది కోసం ఒక ఇంటిని సమకూర్చి.. వాళ్లకు తిండి పెట్టి.. బట్టలు సహా అన్నీ ఇచ్చి.. చదువు చెప్పించడం అన్న మామూలు విషయం కాదు. ఎంతో కమిట్మెంట్.. ఆ పిల్లల మీద ప్రేమ ఉంటే తప్ప ఇలాంటివి కొనసాగించడం సాధ్యం కాదు. తాజాగా తన పుట్టిన రోజు సందర్భంగా హన్సిక చాలామంది లాగా పార్టీలు పబ్బులు అని తిరక్కుండా.. హంగామా చేయకుండా ఈ పిల్లల మధ్యనే ఉండి సింపుల్ గా బర్త్ డే జరుపుకుంది. వాళ్లతో తనకుండే ఆనందం ఎలాంటిదో పంచుకుంది. ఈ పిల్లల బాగోగులన్నీ హన్సిక తల్లే చూస్తుండటం విశేషం. సినీ రంగంలోకి వచ్చిన కొంత కాలానికే హన్సిక పిల్లల్ని దత్తత తీసుకోవడం మొదలుపెట్టింది.

,  ,  ,  ,  ,