Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Apr-2017 11:53:28
facebook Twitter Googleplus
Photo

ఎప్పుడెప్పుడు స్పైడర్ సినిమా ఫస్ట్ లుక్ వస్తుందా అంటూ మహేష్ బాబు అభిమానులందరూ చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నిసార్లు ఎన్ని డేట్లు వచ్చినా కూడా.. లుక్ మాత్రం బయటకు రావట్లేదు. టైటిల్ అఫీషియల్ గా చెప్పట్లేదు. పోస్టర్లు రిలీజ్ చేయట్లేదు. టీజర్లు యుట్యూబ్ లో పెట్టట్లేదు. అయితే ఎట్టకేలకు మురుగుదాస్ డైరక్షన్లో వస్తున్న ఈ సినిమా టీజర్ అండ్ పోస్టర్ రిలీజ్ కు ఒక డేటు దొరికినట్లు తెలుస్తోంది.

వచ్చే ఏప్రియల్ 14న మహేష్-మురుగుదాస్ సినిమా పోస్టర్ బయటకొచ్చే ఛాన్సుందని అంటున్నారు. అయితే ఈ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడానికి అంబేద్కర్ వారి జన్మదినాన్నే ఎందుకు ఎంచుకున్నారని మీకు సందేహం వచ్చిందా? అబ్బే అది కాదు ఇక్కడ రీజన్. అదే రోజున తమిళుల కొత్త సంవత్సరాది వస్తోంది. అందుకే ఫస్ట్ లుక్ ను ఒకేసారి తెలుగు అండ్ తమిళ బాషల్లో అప్పుడే రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నట్లు టాక్.

ఏదేమైనా కూడా తెలుగు వారి ఉగాదికి ట్రీట్ ఏమీ ఇవ్వకుండా ఇలా తమిళ సంవత్సరాదికి ఫస్ట్ లుక్ అంటే మాత్రం ఇక్కడ ఫ్యాన్స్ కాస్త హర్టవుతారనే చెప్పాలి.

,  ,  ,  ,  ,  ,