Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Dec-2017 12:04:48
facebook Twitter Googleplus
Photo

హరిప్రియ టాలీవుడ్ లో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చేస్తోంది. గతంలో చిన్న సినిమాలలో కనిపించిన ఈ భామ.. పిల్ల జమిందార్ చిత్రంతో బాగానే ఆకట్టుకున్నా పెద్ద హీరోలతో అవకాశాలు పొందలేకపోయింది. ప్రస్తుతం కన్నడలో ఫుల్ బిజీ అయిపోయిన హరిప్రియ.. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ 102వ చిత్రం జైసింహా తో గ్రాండ్ కంబ్యాక్ ఇస్తోంది.

కేఎస్ రవి కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం ఇప్పటికే తన పాత్ర షూటింగ్ కూడా పూర్తి చేసేసిన ఈ భామ.. తనలోని అల్లరి యాంగిల్ ను చూపిస్తానని చెబుతోంది. ఇప్పటివరకూ తను చేయని ఓ కొత్త తరహా రోల్ కావడంతో ఎంజాయ్ చేశానని అంటున్న హరిప్రియ.. తన క్యారెక్టర్ కు బోలెడంత ఆటిట్యూడ్ ఉంటుందని చెబుతోంది. తాను దర్శకుల ఆర్టిస్టునని.. వారు ఇచ్చిన అవకాశాన్ని పక్కాగా ఉపయోగించుటానని చెబుతున్న ఈ భామ.. కేఎస్ రవికుమార్ ప్రతీ సీన్ ని మూమెంట్ ను యాక్ట్ చేసి చూపిస్తారని పొగిడేసింది.

ఇక హీరో నందమూరి బాలకృష్ణ అయితే మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్ అంటున్న హరిప్రియ.. ఆయన డెడికేషన్ అద్భుతం అని చెప్పింది.

,  ,  ,  ,