Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Oct-2017 11:20:53
facebook Twitter Googleplus
Photo

రజినీకాంత్ సినిమా తెరకెక్కుతుందంటే చాలు అభిమానుల్లో భారీ అంచనాలు ఉంటాయి. ఏడాదికి ఒక సినిమాను రిలీజ్ చేసే రజినీకాంత్ వచ్చే ఏడాది రెండు సినిమాలతో రాబోతున్నాడు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 2.0 జనవరి లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ ని కూడా సూపర్ స్టార్ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఆ చిత్రం తుది మెరుగులను దిద్దుకొంటుంది.

ఇక మరో సినిమా 'కాలా'.. కబాలి తీసిన పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ లో రిలీజ్ కానుంది. అయితే వీరిద్దరి కలయికలో ఇంతకుముందు వచ్చిన కబాలి సినిమా అంతగా ఆడలేదు. కానీ అందులో పాత్రలు చాలా హైలెట్ గా నిలిచాయి. ఇప్పుడు అదే తరహాలో కాలా లో కూడా కొన్ని పాత్రలను స్టైలిష్ గా చూపించనున్నాడట రంజిత్. ఇందులో బాలీవుడ్ నటి హుమా ఖురేషి ఒక ముఖ్యమైన పాత్ర చేస్తోంది. అయితే హుమా ఈ సినిమాలో ఛాన్స్ రాగానే సంబరపడిపోయిందట. ఎవ్వరికైనా జీవితంలో రజినీకాంత్ తో నటించాలని ఒక ఆశ ఉంటుంది. నాకు కూడా రజినీకాంత్ అంటే చాలా ఇష్టం. కాలా సినిమాలో ఛాన్స్ నా అదృష్టంగా భావిస్తున్నా అని హుమా తెలిపింది.

ఇక ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చిత్ర యూనిట్ మొత్తం చాలా కష్టపడుతున్నారని ఆ నటి తెలిపింది. అంతే కాకుండా వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ఫైనల్ షెడ్యూల్ తో ఈ సినిమా మొత్తం పూర్తవుతుందని.. సినిమా అందరిని ఆకట్టుకుందని హుమా వివరించింది. మరికొన్ని ముఖ్య పాత్రల్లో నానా పటేకర్ - జాకీ ష్రోఫ్ అండ్ పంకజ్ త్రిపాఠి- అంజలీ పాటిల్ తో పాటు సయజీ షిండే - సాక్షి అగర్వాల్ కూడా నటిస్తున్నారు.

,  ,  ,  ,  ,