Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Sep-2016 10:56:13
facebook Twitter Googleplus
Photo

అసలు ఇప్పటివరకు ఎన్నిసార్లు అడిగినా కూడా తన బాయ్ ఫ్రెండ్ గురించి ఓపెన్ గా ఎప్పుడూ చెప్పలేదు గోవా బ్యూటి ఇలియానా. అయితే ఎప్పటికప్పుడు ట్విట్టర్ లో అతగాడి గురించి గాఢమైన రాతలు రాస్తుంటే.. ఇక ఇద్దరి మధ్యనా మ్యాటర్ పరిగెత్తేస్తోందని ఈజీగా అర్ధం చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు బీచ్ లో టూ పీస్ డ్రస్సులతో ఫోజులిస్తూ.. ఈ ఫోటోను ఆండ్రూ నీబోన్ తీశాడు అని చెబుతుంటే.. సారాంశం అర్ధం చేసుకోవడం చాలా వీజీనే మరి.

అయితే మొన్నామధ్యన ఇల్లీ సడన్ గా ఎందుకు వెకేషన్ కు వెళ్ళింది.. ఎందుకు బికినీల్లో ఫోజులు ఇచ్చింది అనే సందేహం ఎవరికైనా రావొచ్చు. ఇదే విషయం మొన్న జరిగిన ''రుస్తుం'' సక్సెస్ పార్టీలో ఎవరో మాట్లాడుకుంటుంటే.. ఆ టైమ్ లో అమ్మడు అక్కడికి హనీమూన్ కు వెళ్లిందిలే అన్నారట. అదేంటి హనీమూన్?? అంటే.. పాపకు ఆస్ర్టేలియాలో ఆండ్రూతో ఎప్పుడో సీక్రెట్ పెళ్ళయ్యిందిగా అనేశారట కొందరు సన్నిహితులు. కావాలంటూ చూస్కోండి అంటూ సెల్ ఫోన్లో వారు తీసిన వీడియో కూడా చూపించారట.

ఇలియానా తన పెళ్లికి కేవలం క్లోజ్ ఫ్రెండ్స్ ను మాత్రమే పిలిచింది కాబట్టి.. ఈ సిడి ఇంకా బయటకు రాలేదు కాని.. లేకపోతే ఈపాటికి న్యూస్ మీడియాలో హెడ్ లైన్స్ లో ఉండేది అంటూ జనాలు జోకులు పేల్చుకున్నారట. రుస్తుం సినిమా హిట్టవ్వడంతో ఇలియానాకు బాలీవుడ్డులో ఇప్పుడిప్పుడే కాసినన్ని ఆఫర్లు వస్తున్నాయి. అందుకే ఈ పెళ్ళి సీక్రెట్ లీక్ చేయట్లేదు కాబోలు.

,  ,  ,  ,  ,