Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Oct-2015 13:50:56
facebook Twitter Googleplus
Photo

ఓ స్టార్ హీరో.. ఓ స్టార్ డైరెక్టర్.. 20 మందికి పైగా ప్రముఖ తారాగణం.. భారీ లొకేషన్లు.. భారీ యాక్షన్ సీన్లు.. మూడు నాలుగు దేశాల్లో షూటింగ్.. ఇంత భారీ ప్లానింగ్ ఉన్న సినిమాను కేవలం ఐదు నెలల్లో పూర్తి చేయడమంటే మాటలు కాదు. అది కూడా ముందే రిలీజ్ డేటిచ్చేసి.. షూటింగ్ పూర్తి చేయడమంటే ఎంతో ప్లానింగ్ ఉండాలి. ఎంతో కష్టపడాలి. ఆ ప్లానింగ్ ఉంది కాబట్టే.. టీం అంత అంత కష్టపడింది కాబట్టే ముందు అనుకున్నట్లే ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ?బ్రూస్ లీ? సినిమా. ఈ సినిమా కోసం యూనిట్ సభ్యులు పడ్డ కష్టం అంతా ఇంతా కాదంటున్నాడు నిర్మాత డీవీవీ దానయ్య. ఆ కష్టం గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం పదండి.

??నా బేనర్లో ఇంత భారీ సినిమా ఎప్పుడూ చేయలేదు. ఇంత వేగంగా కూడా సినిమా తీయలేదు. ఇదంతా శ్రీను వైట్ల అండ్ టీమ్ అద్భుతమైన ప్లానింగ్ యూనిట్ సభ్యులందరి శ్రమ వల్లే సాధ్యమైంది. ఒక్కటంటే ఒక్క రోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా వరుసగా 70 రోజులు కంటిన్యూగా షూట్ చేశామంటే నమ్ముతారా? అది కూడా రోజుకు 15 గంటల పాటు షూటింగ్ జరిగింది. తెల్లవారు జామున పని మొదలైతే.. ఏ అర్ధరాత్రికో పని పూర్తయ్యేది. రామ్ చరణ్ అంత పెద్ద స్టార్ అయినా.. మిగతా తారలందరూ చాలా పేరున్న వాళ్లే అయినా.. ఎవరూ ఇబ్బంది పెట్టలేదు. ఒక్క రోజు కూడా షెడ్యూల్ డిస్టర్బ్ కాలేదు. వేరే ఇబ్బందులు కూడా రాలేదు. ఓ ఐదారు రోజులు షెడ్యూల్ డిస్టర్బ్ అయి ఉన్నా మేం రిలీజ్ డేట్ అందుకోగలిగేవాళ్లం కాదు. అంతా పక్కాగా జరిగిపోయింది. 20 మంది ప్రముఖ తారల డేట్లను అడ్జస్ట్ చేసుకుంటూ పక్కాగా షూట్ చేశాం. పాటలు యాక్షన్ సన్నివేశాల కోసం మూడు దేశాల్లో షూటింగ్ జరిగింది. ఈ సినిమా కోసం తెరకెక్కించిన యాక్షన్ సన్నివేశాలు చూస్తే కళ్లు చెదురుతాయి. బ్యాంకాక్ లో ఆ సన్నివేశాలు తీశాం. ఇంటర్వెల్ కు ముందు వచ్చే ఆ దృశ్యాలు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయి. ఇంతటి భారీ యాక్షన్ సన్నివేశాల్ని కూడా అనుకున్నది అనుకున్నట్లు చేశాం. మేం అనుకున్న దానికంటే బెటర్ ఔట్ పుట్ వచ్చింది?? అని చెప్పాడు దానయ్య.

,  ,  ,  ,