Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Dec-2016 10:35:26
facebook Twitter Googleplus
Photo

జబర్దస్త్ కామెడీ బ్యాచ్ హంగామా మామూలుగా ఉంటుందా..? ఒక్క టీమ్ సభ్యులు ఒకచోట చేరితేనే రచ్చరచ్చగా ఉంటుంది. అలాంటిది జబర్దస్త్ టీమంతా ఒకచోట కలిస్తే ఆ హంగామా మామూలుగా ఉంటుందా..? వీరంతా కలిసి విహార యాత్రకు వెళ్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి! స్క్రిప్ట్ ప్రకారం నటిస్తేనే కామెడీ షోలో అదరగొట్టేస్తుంటారు. అలాంటిది ఎలాంటి బ్రేకులూ లేకుండా బిందాస్ గా హాలీడేకి వీళ్లు వెళ్లారంటే ఆ సందడి మామూలుగా ఉండదు. జబర్దస్త్ టీమ్ అంతా సరదాగా హాలీడేకి వెళ్లొచ్చింది. గోవా తీరంలో హంగామా చేసింది.

జబర్దస్త్ యాంకర్ అనుసూయతోపాటు జడ్జీలు రోజా నాగబాబు కూడా ఈ ట్రిప్ కి వచ్చారు. గాలిపటాల సుధాకర్ సుడిగాలి సుధీర్ గెటప్ శీను అదిరే అభి రచ్చ రవి చమ్మక్ చంద్ర కమీడియన్ వేణు తిరుపతి ప్రకాష్ రాఘవ... వీరితోపాటు జబర్దస్త్ టీమ్ లోని సభ్యులందరూ ఈ ట్రిప్ లో ఎంజాయ్ చేశారు. బీచ్ లో బోటు షికార్లు చేస్తూ ఎంజాయ్ చేశారు. ఇసుకల్లో డాన్సులూ ఒకరిపై ఒకరు సెటైర్లూ కామెడీ జోకులూ సరదా కొట్లాటలూ... గోవా బీచ్ అంతా సందడి చేశారు.

నిజానికి ఈ టీమ్ అంతా గోవా ట్రిప్ కి వెళ్లి వచ్చి చాలా రోజులైంది. అయితే ఒక్క అనసూయ మాత్రమే తాను గోవాలో ఉన్నట్టు ఆ మధ్య కొన్ని స్టిల్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు జబర్దస్త్ ఫ్యామిలీ అంతా చేసిన ఎంజాయ్ మెంట్ కు సంబంధించి చిత్రాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గోవా ట్రిప్ చాలా హ్యాపీగా గడిచిందని జబర్దస్త్ టీమ్ సభ్యులందరూ చెబుతున్నారు. అయితే ఈ ఎంజాయ్ మెంట్ ఫొటోల్లో మరో ఎక్స్ ట్రా జబర్దస్త్ యాంకర్ రేష్మీ కనిపించలేదు. గోవా ట్రిప్ కు ఆమె వెళ్లిట్టు లేదు. జబర్దస్త్ తోపాటు మరికొన్ని షోలకు కూడా ఆమె యాంకరింగ్ చేస్తోంది కదా. బహుశా ఆ షూటింగుల్లో బిజీగా ఉండటం వల్లనే ఆమె ఈ ట్రిప్ కి వెళ్లలేకపోయి ఉంటుంది.

,  ,  ,  ,  ,  ,