Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Apr-2017 11:13:46
facebook Twitter Googleplus
Photo

ఒకప్పుడు హీరోగా ఒక వెలుగు వెలిగిన జగపతిబాబు.. ఆ తర్వాత ప్రభ కోల్పోయాడు. హీరోగా ఆయన బాగా డౌన్ అయిపోయి.. ఒక దశలో ఆయన సినిమాలంటేనే జనాలు పట్టించుకోని పరిస్థితి వచ్చేసింది. ఇలాంటి టైంలో విలన్ అవతారం ఎత్తి లెజెండ్ సినిమా చేయడం ఆయన కెరీర్ ను మలుపు తిప్పింది. ఒక్కసారిగా విలన్.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ తో ఫుల్ బిజీ అయిపోయాడు జగ్గూ భాయ్. ఒకప్పుడు పోయిన ఫాలోయింగ్.. ఫ్యాన్ బేస్ మొత్తం తిరిగొచ్చి టాలీవుడ్లో హైయెస్ట్ పెయిడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమ్ విలన్ గా ఎదిగాడు జగ్గూభాయ్. మళ్లీ క్రేజ్ తెచ్చుకున్నాక ఆయనకు హీరో వేషాల మీద కూడా మనసు మళ్లుతోంది.

ఇటీవలే జగపతిబాబు హీరోగా వారాహి చలనచిత్రం బేనర్ మీద పటేల్ సార్ అనే సినిమా మొదలైన సంగతి తెలిసిందే. విశేషం ఏంటంటే.. దీని కంటే ముందే జగ్గూ భాయ్ హీరోగా సూర్యాభాయ్ అనే సినిమా శ్రీకారం చుట్టుకుంది. అర్జున్ వాసుదేవ్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. చడీచప్పుడు లేకుండా మొదలైన ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసిందట. మే 5 నుంచి చివరి షెడ్యూల్ జరుగుతుందంటూ ప్రెస్ నోట్ ఇస్తూ ఈ చిత్రానికి సంబంధించిన స్టిల్స్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఇందులో జగపతి రఫ్ లుక్ లో బాగానే కనిపిస్తున్నాడు. జులైలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుందట.

,  ,  ,  ,  ,