Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Jun-2017 12:16:38
facebook Twitter Googleplus
Photo

సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా అంటే.. దేశవ్యాప్తంగా బోలెడంత ఆసక్తి ఉంటుంది. అందుకే ఈయన సినిమాలకు సంబంధించిన ప్రతీ అప్ డేట్ హెడ్ లైన్స్ ఎక్కేస్తంటుంది. ప్రస్తుతం కబాలి ఫేం పా రంజిత్ దర్శకత్వంలో రజినీ చేస్తున్నకాలా పరిస్థితి కూడా ఇలాగే ఉంది.

ఇప్పటికే కాలా చిత్రాన్ని ముంబైలో షూటింగ్ చేసేస్తున్నారు. రజినీతో పాటు ఈశ్వరి రావు.. హ్యూమా ఖురేషి.. అంజలి పాటిల్.. నానా పటేకర్.. సముద్రకని లు ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. మరోవైపు ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ ఖాయం అని ముందే ఫిక్స్ చేసుకున్న దర్శకుడు పా రంజిత్.. ఈ మూవీ రేంజ్ ను మరింతగా పెంచేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడట. అందుకే ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టిని ఓ కీలక పాత్ర చేయాల్సిందిగా కోరాడట. కేమియో కంటే కొంచెం ఎక్కువగా ఉండే ఈ రోల్ విషయంలో.. మమ్ముట్టి ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.

ఒకవేళ మమ్ముట్టి అంగీకరిస్తే మాత్రం.. దశాబ్దాల క్రితం దళపతి చిత్రం కాంబో రిపీట్ అయినట్లు అవుతుంది. ఇద్దరు సూపర్ స్టార్లు పోటాపోటీగా నటించిన దళపతి ఎన్నేసి సంచలనాలు సెట్ చేసిందో తెలిసిందే.

,  ,  ,  ,  ,