Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Aug-2015 13:02:04
facebook Twitter Googleplus
Photo

ఇప్పటివరకు శ్రీమంతుడు గురించి పాజిటివ్ న్యూస్ లే కాదు.. కొన్ని నెగటివ్ విషయాలు కూడా వినడానికి ఉన్నాయంటే మీరు నమ్ముతారా? నమ్మి తీరాల్సిందే. మొన్ననే ఒక రూమర్ మహేష్ అభిమానులను తీవ్రంగా కలచివేసింది. ఈ సినిమా ఫైనల్ కట్ చూశాక విలక్షణ నటుడు జగపతి బాబు బాగా అప్సెట్ అయ్యారనేది న్యూస్. శ్రీమంతుడులో ఆయన ఓ కోటీశ్వరుడి గా మహేష్ ఫాథర్ క్యారక్టర్ లో నటిస్తున్నాడు. సినిమా మొత్తంలో తన పాత్ర నిడివి కేవలం 10 నిమిషాల ఉండటం చూసి బాగా హర్టయ్యాడని టాక్ వచ్చిందిలే. అయితే ఇందులో నిజముందా?

అబ్బే అస్సలు లేదు. ఈ విషయాన్ని స్వయంగా జగపతి బాబు ప్రకటించాడు. సెల్వందన్.. అదేనండీ తమిళ శ్రీమంతుడు.. మొన్ననే ఆడియో లాంచ్ చెన్నయ్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జగపతి.. అక్కడి మీడియా తో మాట్టాడాడు. అప్పుడు మనోడిని ఇదే ప్రశ్న అడిగితే.. అసలు నాకు సినిమా అవుట్ పుట్ మీద మక్కువ లేకపోతే ఇప్పుడెందుకు చెన్నయ్ వచ్చి సినిమాను ప్రమోట్ చేస్తాను అని అడిగాడు. అంతేకాకుండా ఈ సినిమాలో తన పాత్ర ఒక అద్భుతం అని చెప్పుకొచ్చాడు కూడా. ప్రీ క్లయ్ మ్యాక్సు లో తనకీ మహేష్ కు మధ్యన జరిగే డైలాగులు చాలా రసవత్తరంగా ఉంటాయని కూడా చెప్పాడు. అంతేకాదు.. అప్పుడెప్పుడో హీరోయిన్ సుకన్య తో చేసిన పెద్దరికం సినిమాను గుర్తు చేస్తూ... ఆ సినిమాలో పెళ్ళి చేసుకున్న తమకు ఇప్పుడు 22 ఏళ్ళ తరువాత మహేష్ కొడుకు గా పుట్టాడంటూ ఆహుతులను నవ్వులలో ముంచెత్తాడు జగపతి. సో డిజప్పాయింట్ అయ్యాడని వస్తున్న రూమర్లన్నీ అబద్దాలే.

,  ,