Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Sep-2016 11:46:40
facebook Twitter Googleplus
Photo

ఇవాళ వినాయక చవితి. దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఎంతో ఘనంగా ఈ పండుగను జరుపుకుంటున్నారు. ప్రతీ ఏటా వచ్చే ఈ పండుగ కోసం ఏడాది మొత్తం ఎదురుచూసే వాళ్లు ఉంటారు కూడా. అలాగే చవితి పందిళ్లలో ఓ ప్రత్యేకత కనిపిస్తుంది. ప్రతీ సందులోనూ పందిరి ఉన్నా.. ఏ గణేషుడికే ఆ గణేషుడే డిఫరెంట్ గా దర్శనమిస్తుంటాడు.

గణేషుడిని తమ ఫ్రెండ్ గానో.. కుటుంబ సభ్యుడిగానో భావించేసే మన జనాలు.. రకరకాల క్రేజీ అవతారాల్లో వినాయకుడిని తయారు చేస్తుంటారు. గతేడాది బాహుబలి గణేషుడు ప్ర్యత్యేక ఆకర్షణ కాగా.. ఈ సారి 'వినాయక గ్యారేజ్' ఆకట్టుకుంటోంది. జనతా గ్యారేజ్.. ఇక్కడ అన్ని రిపేర్లు చేయబడును అనే టైటిల్- ట్యాగ్ లైన్ నుంచి.. 'వినాయక గ్యారేజ్.. ఇక్కడ అన్ని కోరికలు తీర్చబడును' అంటూ రూపొందిన ఓ పోస్టర్ స్పెషల్ అట్రాక్షన్ అయిపోయింది.

చవితి ఇవాళే కాబట్టి.. విచిత్రంగా అనిపించినా ఆకట్టుకున్న మొదటి వినాయక పందిరి ఇదే. మొత్తం నవరాత్రులు పూర్తయ్యేపాటికి ఇలాంటివి చాలానే దర్శనమివ్వచ్చు.

,  ,  ,  ,  ,