Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Oct-2016 13:54:54
facebook Twitter Googleplus
Photo

పక్క భాషల ఓ హీరో ఇక్కడ ఓ హిట్టు కొట్టగలిగితే.. ఇంక ఆ హీరో నటించిన పురాతన కాలం నాటి పాత సినిమాలు కూడా క్యూలో పెట్టి మరీ డబ్బింగ్ చేసేస్తుంటారు. అలాంటిది ఓ జంటగా వరుసగా హిట్స్ కొట్టేస్తుంటే పరిస్థితి ఎలా ఉంటుందో.. త్వరలో రిలీజ్ కానున్న 'జతగా' చిత్రాన్ని చూస్తే అర్ధమవుతుంది. దుల్కర్ సల్మాన్.. నిత్యా మీనన్ ల పెయిర్ కి ఏ రేంజ్ క్రేజ్ ఉందో తెలిసిందే.

వీళ్లిద్దరి కాంబినేషనల్ మలయాళంలో అదరహో అంతే. ఓకే బంగారం ను ఇక్కడ శర్వా వెర్షన్ రిలీజ్ చేశారు కానీ.. 100 డేస్ ఆఫ్ లవ్ చిత్రంలో ప్రేమ జంటగా మెప్పించారు. ఇక బెంగళూరు డేస్ లో జంట వీరిద్దరూ కాకపోయినా.. కలెక్షన్స్ కుమ్మేసింది. కానీ ఈ జంట నటించిన లవ్ పిక్చర్స్ అంటే క్రేజ్ పెరిగిపోయింది. ఈ దుల్కర్ సల్మాన్ కెరీర్ స్టార్టింగ్ లో అంటే 2012లో రిలీజ్ అయిన ఉస్తాద్ హోటల్ లో హీరోయిన్ నిత్యా మీనన్. ఇప్పుడా చిత్రాన్ని 'జతగా' అనే టైటిల్ పై తెలుగులోకి తీసుకొచ్చేస్తున్నారు. ఈ మూవీ ప్రచారానికి వేసిన పోస్టర్స్ చూస్తే మరో రొమాంటిక్ మూవీ చూడబోతున్నామనే ఫీలింగ్ రావడం సహజం.

కానీ ఉస్తాద్ హోటల్ స్టోరీ వేరే. చెఫ్ కావాలని అనుకునే ఓ దుబాయ్ కోటీశ్వరుడి కొడుకు.. పరిస్థితుల కారణంగా వచ్చి కోజికోడ్ లోని తాత నడిపే ఉస్తాద్ హోటల్ లో జాయిన్ అవుతాడు. మరో బిలియనీర్ కూతురు నిత్యామీనన్ ని కాదని మరీ ఈ హోటల్ కే అంకితం అవుతాడు. ఆ హోటల్ కి వచ్చిన ప్రాబ్లెమ్స్.. వాటిని దుల్కర్ ఎలా ఎదుర్కున్నాడన్నదే సినిమా. మధ్యలో హీరోయిన్ హెల్ప్ కూడా ఉంటుంది. కానీ పబ్లిసిటీ మాత్రం దుల్కర్-నిత్యాల రొమాంటిక్ సీన్స్ వేస్తూ.. తెలుగులో వీర ప్రచారం చేస్తుండడం విశేషం.

,  ,  ,  ,