Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Jan-2015 10:35:17
facebook Twitter Googleplus
Photo

కెనడాలో పుట్టిపెరిగిన బెంగాలీ బ్యూటీ ప్రియా బెనర్జీ జాక్ పాట్ కొట్టింది. ఎకాఎకీన బాలీవుడ్ సుందరి ఐశ్వర్యా రాయ్ నటించే చిత్రంలో యంగ్ హీరోయిన్ పాత్రకు ఎంపికైంది. ఆమధ్య వచ్చిన 'కర్మ', ఇటీవల వచ్చిన 'జోరు' సినిమాల ద్వారా ఈ చిన్నది చిత్ర రంగానికి పరిచయమైంది. అయితే, ఈ రెండూ కూడా ఫ్లాపవడంతో తెలుగులో ఆమెకు మళ్లీ అవకాశాలు రాలేదు. ఈ నేపథ్యంలో ఐశ్వర్యారాయ్ ప్రధాన పాత్రధారిణిగా సంజయ్ గుప్తా రూపొందిస్తున్న 'జాజ్బా' చిత్రంలో నటించే ఛాన్స్ ఈ ముద్దుగుమ్మకు దక్కింది. ఈ ఆఫర్ కూడా ఈమెకు తమాషాగా వచ్చింది. సంజయ్ గుప్తా ట్విట్టర్ అకౌంటుకు ప్రియా బెనర్జీ వీడియోను ఎవరో ట్యాగ్ చేశారట. అది చూసిన సదరు దర్శకుడు వెంటనే ఆమెను పిలిపించి, స్క్రీన్ టెస్ట్ చేసి 'జాజ్బా'లో బుక్ చేసుకున్నాడు.

,  ,  ,  ,