Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Jun-2016 15:34:48
facebook Twitter Googleplus
Photo

సూపర్ స్టార్ రజనీ కాంత్‌కు దేశవ్యాప్తంగా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఆయన హీరోగా నటించిన ?కబాలి? టీజర్ విడుదలై సృష్టించిన ప్రభంజనమే ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ స్థాయికి ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమాను మళయాలంతో పాటు హిందీలోనూ డబ్ చేస్తున్నట్లు టీమ్ ప్రకటించింది. హిందీలో ?కబాలి? విడుదలవుతుందని ఎప్పట్నుంచో చెబుతూ వస్తున్నా, తెలుగు, తమిళ వర్షన్స్‌తో పాటే జూలై 1న హిందీలోనూ సినిమా విడుదలవుతుందని టీమ్ తెలిపింది.
తమిళంళో రియలిస్టిక్ సినిమాలతో తనదైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు పా రంజిత్ తెరకెక్కించిన ఈ సినిమాలో రజనీ ఓ గ్యాంగ్‍స్టర్‌గా కనిపించనున్నారు. సంతోష్ నారాయణ్ సంగీతం సమకూర్చారు. అన్ని భాషల్లోనూ థింక్ మ్యూజిక్ ద్వారా విడుదల కానున్న ఆడియో, జూన్ 12న మార్కెట్‌లోకి విడుదల కానుంది. చెన్నైలో జరిగే ఓ భారీ ఈవెంట్‌లో ఆడియో విడుదల కానుంది. కళైపులి థాను నిర్మించిన ఈ సినిమా ఇప్పటికే అన్ని భాషల్లో కలుపుకొని 200 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

,  ,  ,  ,  ,  ,  ,