కబాలి విడుదల తేదీ దగ్గర పడే కొద్దీ అభిమానుల్లో ఉత్సాహం ఎక్కువైపోతోంది. దేశమంతా రజని అభిమానులు కబాలి మానియాతో ఊగిపోతున్నారు. కబాలి చిత్రం సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం ఉందని నిర్మాత కలై పులి ఎస్. థాను అన్నారు. ఈ చిత్రం కనీసం రూ .500 కోట్లు కలెక్ట్ చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ చిత్ర బిజినెస్ ఊహించని విధం గా జరుగుతోందని అన్నారు. రజనికాంత్ కు ప్రపంచవ్యాప్తం గా అభిమానులు ఉన్నారని, ఈ చిత్రం బాహుబలి రికార్డ్ ను బ్రేక్ చేస్తుందని అన్నారు.
యువ దర్శకుడు రంజిత్ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 22 న ప్రపంచ వ్యాప్తం గా విడుదలవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం పై భారీ స్థాయిలో అంచనాలు ఉండగా.. చిత్ర యూనిట్ కనీ విని ఎరుగని రీతిలో ప్రచారం చేస్తోంది.