Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Aug-2016 14:18:20
facebook Twitter Googleplus
Photo

మొదట చిన్న చిన్న పాత్రల్లో నటించి తరువాత ?ఎవడే సుబ్రహ్మణ్యం? సినిమాతో కాస్త గుర్తింపు తెచ్చుకుని తాజాగా ?తరుణ్ భాస్కర్? తెరకెక్కించిన ?పెళ్లి చూపులు? సినిమాలో హీరోయిన్ గా నటించి ఒక్కసారిగా ఫేమస్ అయిన నటి ?రితు వర్మ?. ప్రస్తుతం ఈ సూపర్ సక్సెస్ ను పట్ల ఆమె ఫీలింగ్స్ తెలుసుకోవడానికి ఆమెతో ప్రత్యేకంగా ముచ్చటించాం. ఆ విశేషాలు మీ కోసం?
ప్ర) పెళ్లి చూపులు చిత్రానికి ఇంత గొప్ప స్పందన వస్తుందని ఊహించారా ?
జ) ఈ సినిమా చేస్తున్నంత సేపు మంచి ప్రాజెక్ట్ చేస్తున్నామని అనుకున్నాం. కానీ మరీ ఇంత గొప్ప స్పందన వస్తుందని మాత్రం ఊహించలేదు. ఈ ప్రశంసలు నా హృదయాన్ని కదిలించాయి. ఈ సక్సెస్ ను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను.
ప్ర) ప్రస్తుతం ఇండస్ట్రీ మీ పట్ల ఎలా స్పందిస్తోంది ?
జ) అందరూ చాలా బాగా మాట్లాడుతున్నారు. మంచివిషయాలు చెబుతున్నారు. నాని, రానా వంటి స్టార్లు నా నటనకు మెచ్చుకుంటున్నారు. చాలా మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఫ్యూచర్ అంతా బాగుంటుందనే అనుకుంటున్నాను.
ప్ర) మీ పాత్రకు మంచి ప్రసంశలు వస్తున్నాయి. ఎలా ఫీలవుతున్నారు ?
జ) అవును ! సినిమా చూసిన వాళ్లంతా ఫోన్ చేసే నా పాత్ర బాగుందని, అందులో తమని తాము చూసుకున్నామని చెబుతున్నారు. ఈ గొప్పతనమంతా సినిమా చూసిన అందరి హృదయాలను తాకేంత బలంగా నా పాత్రను రాసిన డైరెక్టర్ ?తరుణ్ భాస్కర్? గారిదే.
ప్ర) అంత సున్నితమైన పాత్ర పోషించేటప్పుడు ఎలా అనిపించింది ?
జ) ఈ పాత్ర కోసం కొన్ని వర్క్ షాపులో పాల్గొన్నాం. నా పాత్ర ఎలా మాట్లాడుతుంది, ఎలా బిహేవ్ చేస్తుంది అనేది బాగా స్టడీ చేశాం. సినిమాని సింక్ సౌండ్ లో షూట్ చేశాం. అందుకే పొరపాట్లు జగకుండా చాలా జాగ్రత్తపడ్డాం. అలాగే తక్కువ మేకప్ తో సింపుల్ గా వెళ్లిపోయాం.
ప్ర) ఈ పాత్రను మీరెలా దక్కించుకున్నారు ?
జ) ?అనుకోకుండా? అనే షార్ట్ ఫిల్మ్ లో నటించేటప్పుడు తరుణ్ నాకు బాగా తెలుసు. అప్పుడే తను నాకీ సినిమా గురించి చెప్పాడు. చాలా బాగా నచ్చింది. కాదనడానికి ఏ కారణమూ కనిపించలేదు. ఇదంతా తరుణ్ నామీద ఉంచిన నమ్మకం వల్లే సాధ్యమైంది.
ప్ర) మీరు నటనలోకి రావడం ఎలా జరిగింది ?
జ) నేను హైదరాబాద్ లోనే పుట్టి పెరిగాను. గ్రాడ్యుయేషన్ అయ్యాక ఓ బ్యూటీ కాంపిటీషన్లో పాల్గొని గెలిచాను. అక్కడే తరుణ్ నన్ను చూసి తన షార్ట్ ఫిలింలో నటించమని అడిగాడు. నేనైతే ముందుగా నటించాలని అనుకోలేదు. కానీ తరుణ్ రెండు రోజుల్లో షార్ట్ ఫిలిం పూర్తి చేశాడు. నేనేదీ అనుకోలేదు అంతా ఫాస్ట్ గా జరిగిపోయి ఇప్పుడిక్కడున్నాను. నేనేది చేసినా ప్రేమించే చేస్తాను.
ప్ర ) షూటింగ్ జరిగేటప్పుడు ఏదైనా మర్చిపోలేని సంఘటన ఉందా ?
జ) సినిమా చివర్లో నాకు, మా నాన్నకు మధ్య జరిగే సన్నివేశం నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను మామూలుగానే మా నాన్నకు చాలా క్లోజ్ గా ఉంటాను. అందుకే ఆ సీన్ షూట్ చేసేటప్పుడు గ్లిజరిన్ అవసరం లేకుండానే ఏడ్చేశాను. అది నెచ్యురల్ గా వచ్చేసింది.
ప్ర) ?విజయ్ దేవరకొండ? తో పని చేయడం ఎలా ఉంది ?
జ ) ?ఎవడే సుబ్రమణ్యం? సినిమా చేసేటప్పుడు నాకు, విజయ్ కు పెద్దగా పరిచయం లేదు. దాంతో నేను విజయ్ రియల్ లైఫ్ లో కూడా రిషి పాత్రలో లానే ఉంటడనుకున్నా. కానీ సినిమా చేసేటప్పుడు ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. అందుకే కెమిస్ట్రీ కూడా బాగా కలిసింది.
ప్ర) మీ నిర్మాతలతో పని చేయడం ఎలా ఉంది ?
జ) ఈ క్రెడిట్ చాలా వరకూ ప్రొడ్యూసర్లకే వెళుతుంది. ప్రాజెక్టుని నమ్మి బాగా సపోర్ట్ చేసారు. ఇక సురేష్ బాబుగారి ఇన్వాల్వ్మెంట్ సినిమాను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లింది.
ప్ర) తరువాత ఏం చేద్దామనుకుంటున్నారు ?
జ) ఈ సినిమా ద్వారా వచ్చిన ఫేమ్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నాను. మంచి పాత్రల ద్వారా గుర్తుండిపోయే సినిమాలు చేయాలని అనుకుంటున్నాను. తరుణ్ లాంటి కొత్త దర్శకులు నాకు చాలెంజింగ్ గా ఉండే మంచి పాత్రలు రాయగలరు.
ప్ర) మీరు చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్టుల గురించి ఏమైనా చెబుతారా ?
జ) ఇప్పటి వరకూ తెలుగులో ఎలాంటి కొత్త ప్రాజెక్టులకు సైన్ చెయ్యలేదు. కానీ తమిళంలో నా డెబ్యూట్ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ అవడానికి సిద్ధంగా ఉంది.

,  ,  ,  ,