Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Sep-2017 11:33:41
facebook Twitter Googleplus
Photo

పెరిగినా సొగసు ఏ మాత్రం తరగని సొగసరి కాజల్ అగర్వాల్. ముసిముసి నవ్వులు.. మూతి విరుపులతో ఇప్పటికీ వెండితెరపై అభిమానులను మురిపిస్తూనే ఉంది. అందుకే ఇప్పటికీ హీరోలు ఏరికోరి ఆమెను హీరోయిన్ గా ఎంచుకుంటున్నారు. ఈ మధ్య కాస్తంత స్పీడు తగ్గినట్టు అనిపించినా తిరిగి వరసగా సినిమాల్లో కనిపిస్తూ యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీయే ఇస్తోంది.

బేసిక్ గా కాజల్ సోషల్ మీడియాలో అంత ఎక్కువ యాక్టివ్ గా ఏమీ ఉండదు. తన ట్విట్టర్ ద్వారా అప్పుడప్పుడు విష్ చేస్తుంటుంది. రీసెంట్ గా అలసి సొలసి ఆదమరిచి నిద్ర పోవడానికి సిద్ధమవుతూ గుడ్ నైట్ మెసేజ్ ఒకటి షేర్ చేసింది. ఇంటిలో ఉన్నప్పుడు కాకుండా షూటింగ్ కోసం వచ్చి హోటల్ నుంచి ఈ ఫొటో షేర్ చేసినట్టుంది. ‘రెడీ ఫర్ ద స్వీటెస్ట్ డ్రీమ్స్.. గుడ్ నైట్ మై లవ్ లీ ట్వీపుల్’ అంటూ ట్వీట్ పెట్టింది. ట్విట్టర్ ఉన్న పీపుల్ ను ఉద్దేశించి ట్వీపుల్ అంటూ పదప్రయోగం చేసిందన్న మాట. ఇంతవరకు బాగానే ఉన్నా కాజల్ బెడ్ పక్కనే టేబుల్ పై మందు బిళ్లలు అవీ ఉన్నాయి. ఆ ట్యాబ్లెట్లు.. ఆ సరంజామా అంతా చూస్తే జ్వరం బారిన పడిందేమో అనిపించక మానదు. వాటి గురించి కాజల్ అయితే మరి ఏమీ చెప్పలేదు.

రీసెంట్ గా రిలీజైన నేనే రాజు - నేనే మంత్రిలో రాధమ్మ పాత్రలో కాజల్ చాలా అందంగా కనిపించి అందరి కనువిందు చేసింది. ఇదే టైంలో చేసిన అజిత్ హీరోగా చేసిన తమిళ్ సినిమా వివేకం మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే ఇంకా కాజల్ చేతిలో రెండు క్రేజీ ప్రాజెక్టులున్నాయి.

,  ,  ,  ,  ,  ,  ,