Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Feb-2017 16:27:42
facebook Twitter Googleplus
Photo

కొణిదెల ప్రొడక్షన్స్ అంటూ రామ్ చరణ్ నిర్మాతగానూ కెరీర్ బ్రహ్మాండంగా స్టార్ట్ చేసేశాడు. మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150తో ప్రొడక్షన్ రంగంలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు మెగాపవర్ స్టార్. ఇప్పుడు చిరంజీవి 151వ సినిమాకు కూడా చెర్రీనే నిర్మాత అనే విషయం కన్ఫాం కాగా.. కొణిదెల ప్రొడక్షన్స్ నెం.3 పై ఇప్పుడు చక్కర్లు కొడుతున్న రూమర్ సెన్సేషన్ అవుతోంది.

ఎన్టీఆర్- త్రివిక్రమ్.. టాలీవుడ్ చాలా సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న కాంబినేషన్ ఇది. ఈ కాంబోను కొణిదెల బ్యానర్ ఖాయం చేసిందనే వార్తలు వస్తున్నాయి. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై తీయనున్న మూడో చిత్రాన్ని.. ఎన్టీఆర్ హీరోగా ఖాయం చేశారట. మెగా హీరో ప్రొడక్షన్ లో.. నందమూరి హీరో మూవీ అంటేనే సంచలనం అయితే.. ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కించనుండడం హాట్ టాపిక్ అయిపోయింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో మూవీకి సిద్ధమవుతున్న త్రివిక్రమ్.. తర్వాత మూవీగానే ఈ సినిమా ఉండనుందట.

మరోవైపు బాబీ డైరెక్షన్ లో ఎన్టీఆర్ చేస్తున్న జై లవ కుశ.. ఆగస్ట్ లో రిలీజ్ ప్లాన్ చేశారు. వీరిద్దరితో కలిపి సెప్టెంబర్ నుంచి కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడట త్రివిక్రమ్. ప్రస్తుతం ఇది రూమర్ అయినా.. ప్రాజెక్టు సాధ్యమైతే మాత్రం.. టాలీవుడ్ లో బిగ్గెస్ట్ సెన్సేషన్ అవుతుంది. అన్నట్లు.. రామ్ చరణ్-ఎన్టీఆర్ లు క్లోజ్ ఫ్రెండ్స్ అనే విషయం తెలుసు కదా!

,  ,  ,  ,  ,