Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

31-Oct-2016 12:16:58
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గ్లామర్ షో బాగానే చేస్తుంది కానీ.. మరీ శృతి మించడం లాంటివి ఉండవు. హద్దుల్లోనే ఉంటూ అందం అభినయం అందించడం అమ్మడి స్పెషాలిటీ. చందమామకి ఏమయిందో చెప్పలేం కానీ.. తన నెక్ట్స్ మూవీలో హాట్ సీన్స్ లో కూడా నటించేసిందని తెలుస్తోంది.

కావలై వేండాం అంటూ జీవా సరసన కాజల్ నటిస్తుండగా.. తెలుగులో ఎంతవరకూ ఈ ప్రేమ అనే టైటిల్ పై ఈ మూవీ డబ్ అవుతోంది. రీసెంట్ గా తమిళ్ వెర్షన్ ను సెన్సార్ కు పంపగా.. హాట్ సీన్స్ కాజల్ చూపించిన తెగువ చూసి సెన్సార్ సభ్యులు కూడా షాక్ తినేశారట. ఇప్పటివరకూ ఈ భామను ఈ స్థాయిలో చూసి ఉండకపోవడం ఒక కారణమైతే.. ఈ హాట్ సీన్స్ కాంట్రవర్సీ సృష్టించేందుకు కూడా అవకాశం ఉంటాయని అంటున్నారట వీళ్లు. వెండితెరపై హాట్ సీన్స్ కొత్త కాదు కానీ.. వివాదాలు సృష్టించే స్థాయిలో వెండితెరను కాజల్ వేడెక్కించిందన్న న్యూస్ మాత్రం అభిమానులకు కొత్తగానే ఉంది.

కాజల్ తాజా సినిమాలు సర్దార్ గబ్బర్ సింగ్.. బ్రహ్మోత్సవం లు ఫెయిల్ కావడం.. కావలై వేండాంపై ఈ ముద్దుగుమ్మకు బోలెడంత కాన్ఫిడెన్స్ ఉండడంతో.. హిట్ కోసం తన వంతు ప్రయత్నాల్లో భాగంగానే కాజల్ ఇలా రెచ్చిపోయిందనే టాక్ వినిపిస్తోంది. మరి కాజల్ అంతగా ఏం చేసిందో తెలియాలంటే మాత్రం నవంబర్ 17వరకూ ఆగక తప్పదు.

,  ,  ,  ,  ,