Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Oct-2016 10:58:06
facebook Twitter Googleplus
Photo

నందమూరి కళ్యాణ్ రామ్-పూరీ జగన్నాధ్ ల కాంబినేషన్ లో రూపొందిన ఇజం.. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గతేడాది పటాస్ లో ఫామ్ లోకి వచ్చిన ఈ నందమూరి హీరో.. మళ్లీ షేర్ తో డీలా పడ్డాడు. ఆ తర్వాత రెట్టింపు వేగంతో బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు గాను.. తన కెరీర్ లోనే తొలిసారిగా ఓ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు.

పనామా పేపర్ల కాన్సెప్ట్ తో బ్లాక్ మనీ అంశంపై ఈ సినిమా తీస్తున్నారనే టాక్ ఉండగా.. అది నిజమేనంటూ.. అయితే తమ స్టోరీ రీసెంట్ లీక్స్ ని టచ్ చేయదని.. దానికి ముందే ఈ స్టోరీని ఫైనల్ చేశామని చెబుతున్నాడు కళ్యాణ్ రామ్. 'ఇజం మూవీ అంతా ఐడియాలజీ-ఫిలాసఫీల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇది పూరీ ఇజం.. కళ్యాణ్ రామ్ ఇజం కాదు. ఆడియన్స్ ఓ కొత్త ఇజం చూస్తారు. పర్సనల్ గా అయితే నేను హ్యూమనిజంను నమ్ముతాను. ఇజంలో నేను జర్నలిస్ట్ పాత్ర పోషిస్తుండగా.. నాపై నేనే సెటైర్స్ కూడా వేసుకుంటాను. అయితే వాటన్నిటికి సమాధానాలు ఇవ్వగలను. పూరీ నా యాక్టింగ్ ని పొగిడిన కోర్ట్ సీన్ గురించి రిలీజ్ తర్వాతే మాట్లాడతాను.' అంటున్నాడు కళ్యాణ్ రామ్.

'ఈ కేరక్టర్ కోసం కొత్తగా కనిపించాలనే ఉద్దేశ్యంతోనే 10 కిలోల బరువు తగ్గాను. ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయినా సరే సిక్స్ ప్యాక్ ట్రై చేశాను' అని నవ్వేస్తున్నాడు కళ్యాణ్ రామ్. తనే నటించిన సన్నివేశాలు కూడా సినిమా రెడీ అయ్యాక చూస్తే థ్రిల్ అనిపించాయట. అందుకే సక్సెస్ పై ఫుల్ కాన్ఫిడెన్స్ చూపించేస్తున్నాడీ నందమూరి హీరో.

,  ,  ,  ,