Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Jun-2017 10:38:13
facebook Twitter Googleplus
Photo

ఎప్పుడో రెండు దశాబ్దాల కిందట బ్రిటిష్ రాణి ఎలిజబెత్ సమక్షంలో అట్టహాసంగా ఈ సినిమాను స్వీయ దర్శకత్వంలో మొదలుపెట్టాడు కమల్. కానీ కొన్నాళ్లు షూటింగ్ జరుపుకున్నాక అనివార్య కారణాలతో ఆగిపోయిందా చిత్రం. ఐతే దాన్ని మళ్లీ మొదలుపెట్టాలని.. పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తేవాలని తపిస్తున్నాడు కమల్. కానీ అతడి కోరిక నెరవేరట్లేదు.

ఈ సినిమాను బయటికి తీసుకొచ్చే నిర్మాణ సంస్థ కోసం కమల్ ఎదురు చూపులు కొనసాగుతూనే ఉన్నాయి. తన కొత్త సినిమాల విడుదలకు ముందు మీడియాను కలిసినపుడల్లా మరుదనాయగం గురించి మాట్లాడే కమల్.. ఎప్పటికైనా ఆ సినిమాను బయటికి తేవాలన్న సంకల్పంతోనే కనిపిస్తాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో కమల్ మరోసారి మరుదనాయగం గురించి మాట్లాడాడు.

ఈ సినిమా థియేటర్లలోకి వస్తుందా అని అడిగితే.. థియేటర్లలోకే రావాలని ఏముంది? అది వెబ్ సిరీస్ లేదా టీవీ సిరీస్ రూపంలోకి మారొచ్చేమో. ఆ విధంగా అయినా ప్రేక్షకుల్ని పలకరించొచ్చేమో అన్నాడు. ప్రపంచంలో అనేక దేశాల్లో టీవీ సిరీస్.. వెబ్ సిరీస్ ఇప్పటికే ఎంతో పాపులర్ అయ్యాయి. ప్రస్తుతం ఇండియాలోనూ వెబ్ సిరీస్ జోరు పెరుగుతోంది. మున్ముందు టీవీ సిరీస్ కూడా ఇక్కడ పాపులర్ అవుతాయని భావిస్తున్నారు.

,  ,  ,  ,  ,