Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-May-2015 11:33:10
facebook Twitter Googleplus
Photo

కమల్ సినిమాలు విడుదలకి ముందు విమర్శలు .. తరువాత ప్రశంసలు పొందుతుంటాయి. ఆయన మాత్రం వాటి జయాపజయాల గురించి పెద్దగా పట్టించుకోకుండా, ఆ తరువాత చేయవలసిన సినిమాపై దృష్టి పెడుతుంటాడు. అందువల్లనే ఆయన సినిమాలు చకచకా ప్రేక్షకుల ముందుకి వచ్చేస్తుంటాయి. అంతే వేగంగా ఆయన తాజా చిత్రం 'తూంగా వనం' (నిద్రపోని అడవి) నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. ఈ సినిమా పేరునుబట్టే ఇది ఒక థ్రిల్లర్ కథాంశం అనే విషయం తెలిసిపోతుంది.

తన సొంత బ్యానర్ పై ద్విభాషా (తెలుగు .. తమిళ) చిత్రంగా ఇది రూపొందుతుందని కమల్ చెప్పాడు. అంతే కాదు కేవలం మూడు నెలల్లోనే ఈ సినిమాను పూర్తిచేసేలా ప్లాన్ చేశాడు. రాజేష్ ఎం.సెల్వ దర్శకుడిగా వ్యవరిస్తోన్న ఈ సినిమాలో కమల్ పోలీస్ అధికారిగా నటిస్తూ వుండగా, ఆయన జోడీగా మనీషా కోయిరాలా కనిపించనుంది. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ .. త్రిష ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని ఈ నెల 25న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

,  ,  ,  ,  ,  ,