Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-May-2016 12:51:10
facebook Twitter Googleplus
Photo

దర్శకుడు పూరీ జగన్నాథ్ ? యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ల కాంబినేషన్‌లో ?టెంపర్? లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మరో కొత్త సినిమా త్వరలోనే తెరకెక్కనుందన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మొదటి సినిమా ?ఆంధ్రావాలా? పరాజయం పాలైనా, రెండో సినిమా ?టెంపర్? మాత్రం ఈ కాంబినేషన్‌కు ఓ ప్రత్యేక క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. ఎన్టీఆర్‌ను కొత్తగా పరిచయం చేసిన క్రెడిట్ పూరీకే దక్కుతుంది. ఇక ?టెంపర్? తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమా గురించి కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతోంది.
ఈ సినిమాకు నేతాజీ అన్న టైటిల్‍ను పరిశీలిస్తున్నట్లు ఈ ప్రచారాలు సాగాయి. అయితే ఇదే విషయమై మాకు అందించిన సమాచారం పేరకు పూరీ-ఎన్టీఆర్‌ల సినిమాకు ఇంకా కథే ఫిక్స్ కాలేదని తెలుస్తోంది. కథ ఓకే అయ్యాకే టైటిల్ ఏదన్నది తెలిసే అవకాశం ఉండడంతో ఇప్పటివరకూ వినిపిస్తున్న వార్తలన్నీ పుకార్లుగానే తెలుస్తోంది. ఆగష్టులో సెట్స్‌పైకి వెళ్ళే సూచనలు కనిపిస్తోన్న ఈ సినిమాను బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు. ఇక ప్రస్తుతానికి పూరీ కళ్యాణ్‌రామ్‌తో ఓ సినిమా చేయనుండగా, ఎన్టీఆర్, ?జనతా గ్యారెజ్‌?తో బిజీగా ఉన్నారు.

,  ,  ,  ,  ,  ,