Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Dec-2015 18:42:04
facebook Twitter Googleplus
Photo

మంట పుట్టించే మాటలతో సెగ పుట్టించే ప్రఖ్యాత దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన చెన్నై మహానగరానికి సంబంధించి సినిమా స్టార్లు ప్రకటిస్తున్న సాయంపై ఆయన ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. వందల కోట్ల రూపాయిలు ఉన్న స్టార్లు.. లక్షల రూపాయిల విరాళాలు ఇస్తూ బిచ్చం వేస్తున్నారా? అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. స్టార్టలను తిట్టేసిన వర్మ.. తాను అత్యంత స్వార్థపరుడినని.. తన జీవితంలో ఎవరికి దానం చేయలేదని.. అందుకే తాను దానం ఇవ్వటం లేదన్న ఆయన.. విరాళాలు ప్రకటించిన స్టార్లనే కాదు.. ఈ విధ్వంసానికి కారణం దేవుడు కూడా అంటూ.. కనిపించని దేవుడ్ని సైతం తిట్టిపోశారు.

వర్షాలు కురిసేది దేవుడి వల్లనే కాబట్టి.. దేవుడ్ని ప్రార్థించటానికి బదులు విమర్శించాలన్నారు. చెన్నై వాసులను చూసి తాను చాలా బాధ పడుతున్నానని.. ఆయన సాగించిన ఉగ్రవాద విధ్వంసం మీద తాను పిచ్చ కోపంగా ఉన్నట్లుగా చెప్పుకున్నారు. దేవుడ్ని వెన్నుపోటుదారుడిగా అభివర్ణించిన వర్మ.. ఇకపై ప్రజలు దేవుడ్ని ప్రార్థిస్తూ టైం వేస్ట్ చేసుకునే కన్నా.. తమ మీద తాము నమ్మకం పెట్టుకోవాలంటూ కొత్త తత్వ బోధన షురూ చేశారు. చెన్నైలో దేవుడు సృష్టించిన విధ్వసం ముందు ప్రపంచంలోని ఏ ఉగ్రవాద చర్య అయినా చిన్నదేనని చెప్పిన వర్మ.. చెన్నై వాసుల కష్టాలు చూశాక తన గుండె చెదిరిపోతుందన్నాడు.

తాను రాయలేనంత దారుణంగా దేవుడ్ని తిడుతున్నానని చెప్పిన వర్మ.. సినిమా సెలబ్రిటీల మీద తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. వందల కోట్లు ఉన్న సూపర్ స్టార్లు.. వేలాది కోట్ల రూపాయిలు నష్టపోయిన చెన్నైవాసులకు రూ.5.. రూ.10 లక్షలు సాయాన్ని ప్రకటించటాన్ని బిచ్చంతో పోల్చారు. సూపర్ స్టార్లు.. రూ.10లక్షలు.. రూ.5 లక్షలు డబ్బు ఇస్తే.. అంత డబ్బును ఏంచేయాలో అర్థం కాక చెన్నై ప్రజలు స్పృహ కోల్పోతారన్న వర్మ.. దాని కంటే ఇవ్వకుండా ఉండటం మంచిదన్నారు. చెన్నైలో కురిసిన భారీ వర్షాల కారణంగా సూపర్ స్టార్ రజనీకాంత్ రూ.10లక్షలు సాయంగా ప్రకటించటం గమనార్హం.

,  ,  ,  ,  ,