Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Nov-2016 12:06:04
facebook Twitter Googleplus
Photo

కమల్ హాసన్-గౌతమిలు ఇప్పుడు విడిపోయారన్న మాట అధికారికమే. కమల్ తో బ్రేకప్ పై తనే ఓ సుదీర్ఘమైన ఓపెన్ లెటర్ రాసిన గౌతమి.. విడిపోయే పరిస్థితుల గురించి కాకపోయినా.. తను కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పింది. ఇప్పుడీ సంఘటనపై కమల్ హాసన్ కూడా స్పందించారని తెలుస్తోంది.

'గౌతమికి ఎక్కడ కంఫర్ట్ గా ఉంటుందో.. ఎలా సౌఖ్యంగా ఉంటుందో ఆ నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ తనకు ఉంది. ఈ సమయంలో నా ఫీలింగ్స్ కి పెద్దగా ప్రాముఖ్యత లేదు. గౌతమి.. సుబ్బు(గౌతమి కూతురు)లు సంతోషంగా సుఖంగా ఉంటున్నారా లేదా అన్నదే పాయింట్. అలాగే వారికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. ఎప్పుడు నాతో ఏ అవసరం వచ్చినా వారిద్దరికి అండగా ఉండేందుకు సిద్ధంగా ఉంటాను' అని కమల్ హాసన్ చెప్పినట్లు వార్తలు తెలుస్తోంది.

'ఇంత మంచి కూతుళ్లు ముగ్గురు ఉండడం నా అదృష్టం. శృతి.. అక్షర.. సుబ్బులక్ష్మి. ముగ్గురూ నాకు సమానమే. ఈ ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతుడునైన తండ్రిని నేనే' అని కమల్ చెప్పాడని అంటున్నారు.

,  ,  ,  ,  ,  ,