Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-May-2015 11:50:17
facebook Twitter Googleplus
Photo

దెయ్యాలు ఉన్నాయా ..? ఉంటే అవి ఎలా ఉంటాయి ..? ఎలా ప్రవర్తిస్తాయి ..? అనే ఆసక్తి చాలు, ఈ తరహా కథా కథనాలతో తెరకెక్కే సినిమాలకి కాసుల వర్షం కురిపించడానికి. అలాంటి ఆసక్తిని అదనుచూసి పట్టుకున్న లారెన్స్, వరుసగా దెయ్యం నేపథ్యంతో నటుడిగాను .. దర్శకుడిగాను విజయాలు సాధిస్తూ వస్తున్నాడు. తాజాగా వచ్చిన 'కాంచన 2' సాధిస్తోన్న కలెక్షన్లు, ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తించడంలోను ... సిద్ధపడి వచ్చిన ప్రేక్షకులను భయపెట్టడంలోను ఆయన మరోసారి సక్సెస్ అయ్యాడని సినీపండితులు చెబుతున్నారు.

కాంచన సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాలో లారెన్స్ .. తాప్సీ .. నిత్యామీనన్ కలిసి చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఈ సినిమా నిర్మాణానికి గాను 20 కోట్ల రూపాయల లోపు ఖర్చు చేయగా, విడుదలైన రెండు వారాలలో తమిళ .. కేరళ .. కర్ణాటక .. ప్రాంతాల కలెక్షన్లు 50 కోట్లు దాటినట్టు చెబుతున్నారు. ఇంకా అక్కడ అదే ఊపుతో ఈ సినిమా కొనసాగుతుండగా, 'గంగ' పేరుతో తెలుగులోకి అనువదించబడి ఇక్కడ కూడా భారీ వసూళ్లను రాబడుతోంది. దెయ్యం ఉందా .. లేదా ? అనే విషయాన్ని పక్కన పెడితే లారెన్స్ చేసిన మ్యాజిక్ మాత్రం వర్కౌట్ అయిందనే అంతా చెప్పుకుంటున్నారు.

,  ,  ,  ,  ,  ,