Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Apr-2016 12:09:20
facebook Twitter Googleplus
Photo

ఇప్పటివరకు కేవలం ఏముందిలే ఒక టాలెంటెడ్ నటీమణి మాత్రమే అనుకున్న కంగనా రనౌత్.. ఎప్పుడూ హాటుగా మ్యాగజైన్స్ లో లింగరీలో ఫోజులు ఇవ్వడమే కాదు.. అవసరమైతే ఎవరిమీదనైనా కోర్టు కేసు వేస్తుంది.. కావాలంటే నేషనల్ అవార్డు గెలుచుకుంటుంది.. ఇంకా ఏదైనా కూడా చేస్తుంది అని ప్రూవ్ చేసుకుంది. పెద్ద పెద్ద సినిమాలు ఇంకా ఆమె ఖాతాలో పడట్లేదేమో కాని.. ఆమె మాత్రం ఒక స్టయిలున్న హీరోయిన్ అని ప్రూవ్ చేసుకుంటూనే ఉంది. అయితే హాలీవుడ్ లో స్ర్కీన్ రైటింగ్ కోర్సులు చేసి.. తన క్వీన్ సినిమాకు తానే మాటలు కూడా రాసుకున్న కంగన.. ప్రెస్ మీట్లలో కూడా జోకులు బాగానే పేలుస్తోంది.

నిన్న ఒక ప్రెస్ మీట్ కు వచ్చిన కంగనను.. ఒక విలేఖరి ఏమని అడిగాడంటే.. ''మీకు ప్రపోజ్ చేయాలంటే.. ఏం చేయాలి? ఎలా చేస్తే మీకు ఇష్టం?'' అన్నాడు. దానికి సమాధానమిస్తూ.. ''నాకు ప్రపోజ్ చేయాలంటే ఒక పూల బోకే ఇస్తే చాలు. కోర్టు నోటీసులు వంటివి పంపక్కర్లేదు. మంచి పువ్వులతో కూడిన బోకె ఒకటి తెచ్చి.. గాలిబ్ వంటి కవులు రాసిన పొయెట్రీ ఏదైనా ఒక లేఖలో రాసి ఇచ్చేయండి'' అంటూ జోకేసింది. అక్కడున్న మీడియా వారందరూ.. కంగన అలా హృతిక్ పై ఇన్ డైరెక్టుగా జోకులు వేయడం చూసి పకపకా నవ్వుకున్నారు.

తనను అపహాస్యం చేస్తూ.. ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అంటూ లేనిపోనివి జనాలకు చెబుతోందని కంగనపై హృతిక్ కేసు వేయడం.. ఇక తనను ఈ-మెయిల్స్ లో ప్రపోజ్ చేస్తూ వేధించాడంటూ కంగన కౌంటర్ కేసులు వేయడం మనకు తెలిసిందే.

,  ,  ,  ,