Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Feb-2016 10:36:47
facebook Twitter Googleplus
Photo

ఇటివలే కన్నడ లో మంచి విజయం సాధించిన హారర్ థ్రిల్లర్ 'లాస్ట్ బస్'. ఈ చిత్రానికి ఎంత ఆదరణ లభించిందంటే, ఇప్పుడు ఫ్రెంచ్ భాష లో దుబ్బింగ్ కి సైతం సిద్ధం అవుతోంది. ఈ చిత్రం తెలుగు హక్కులను శ్రీ మంజునాథ మూవీ మేకర్స్ సంస్థ మంచి ఫాన్సీ ఆఫర్ ను ఇచ్చి కైవసం చేసుకుంది.

ఈ చిత్రం లో ని 'డూరీ డూరీ ' పాట ను BBC ఆసియ రేడియో నెట్వర్క్ లో సైతం ఫీచర్ చేయటం జరిగింది. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతునాయి. అవినాష్ నరసింహ రాజు, మేఘశ్రీ భాగవతార్, ప్రకాష్ బేలవాడి ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఎస్. డి. అరవింద్ దర్శకత్వం వహించారు.

ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం కుడా ఆయనే అందించారు. రిలీజ్ డేట్ మరియు ఇతర వివరాలను త్వరలోనే తెలుపుతామని శ్రీ మంజునాథ మూవీ మేకర్స్ సంస్థ తెలిపింది. ఈ చిత్రం తెలుగు లో మంచి విజయం సాధిస్తుంది అని, కన్నడ అందుకున్న ప్రశంశలు తెలుగు రాష్ట్రాలలో కూడా అందుకుంటుంది అని ఆ సంస్థ తెలిపింది.

అవినాష్ నరసింహ రాజు, సామర్థ్ నరసింహరాజు, మేఘశ్రీ భాగవతార్, ప్రకాష్ బేలవాడి, మానసా జోషి , దీపా గౌడా, రాజేష్ పి, రాకా శంకర్, స్నేహ నాగరాజ్ ఈ చిత్రం లో ని ప్రధాన నటులు.


ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి - అనంత్ . ఎడిటింగ్ - శ్రీ క్రేజీ సంగీతం : ఎస్. డి. అరవింద్ . నిర్మాతలు - శ్రీ మంజునాథ మూవీ మేకర్స్ రచన - దర్శకత్వం - ఎస్. డి. అరవింద్

,  ,  ,  ,  ,  ,  ,