Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Mar-2017 11:20:30
facebook Twitter Googleplus
Photo

పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ కాటమరాయుడు.. ఇప్పుడు షూటింగ్ తో పాటు.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసేసుకుంది. ఫైనల్ కాపీని ఒకటికి రెండు సార్లు చూసిన దర్శకుడు డాలీ.. నిర్మాత శరత్ మరార్ పూర్తి సంతృప్తిగా ఉన్నారు.

ఇప్పటికే కాటమరాయుడు సెన్సార్ కు కూడా దరఖాస్తు చేసుకోగా.. ఇవాళే ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోనుంది. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టెయినర్ కావడంతో.. సర్టిఫికేట్ పై ఇప్పటికే ఓ క్లారిటీ ఉంది. కాటమరాయుడు మూవీకి యూ/ఏ సర్టిఫికేట్ లభించే అవకాశాలున్నాయని అంటున్నారు. సాయంత్రానికి సెన్సార్ సర్టిఫికేట్ చేతికి అందనుండడంతో.. రిలీజ్ ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నారు. మార్చ్ 24న కాటమరాయుడు రిలీజ్ ఖాయం అనే విషయం ఇప్పుడు తేలిపోయింది. అలాగే మార్చ్ 23న యూఎస్ ఏ లో ప్రీమియర్ షోలను టెలికాస్ట్ చేయనున్నారు.

ఇప్పటివరకూ అమెరికాలో ఏ తెలుగు సినిమా ప్రదర్శించని స్థాయిలో.. కాటమరాయుడు ప్రీమియర్స్ ను ప్లాన్ చేశారు. ప్రీమియర్ షోలతోనే.. మిలియన్ డాలర్ల వసూళ్లను పవర్ స్టార్ మూవీ సాధించేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కాటమరాయుడు గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానుంది

,  ,  ,  ,  ,