Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Oct-2016 10:41:51
facebook Twitter Googleplus
Photo

సంక్రాంతికి కథాకళి సినిమాతో.. వేసవికి రాయుడుతో పలకరించాడు తమిళ స్టార్ హీరో విశాల్. మళ్లీ దీపావళి నాటికి అతడి కొత్త సినిమా వచ్చేస్తోంది. తమిళంలో కత్తి సెండై (కత్తి యుద్ధం) పేరుతో తెరకెక్కుతున్న విశాల్ కొత్త సినిమా తెలుగులో ఒక్కడొచ్చాడు పేరుతో అనువాదం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తమిళ టీజర్ రిలీజైంది. ఇది మామూలు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అనిపిస్తోంది టీజర్ చూస్తుంటే.

విశాల్ సినిమాలంటూ అదిరిపోయే యాక్షన్ సీన్లకు పెట్టింది పేరు. నిమిషం నిడివి ఉన్న టీజర్ నిండా అవే కనిపించాయి. టాప్ లేచిపోయేలా ఊర మాస్ ఫైట్లు చేస్తూ కనిపించాడు విశాల్. తమన్నా గ్లామరస్ క్యారెక్టర్లో కనిపిస్తుంటే.. కామెడీ బాధ్యతను సూరి.. వడివేలు తీసుకున్నారు. జగపతి బాబు ఈ చిత్రంలో విలన్ క్యారెక్టర్ చేయడం విశేషం. తనకు అలవాటైన స్టైలిష్ విలన్ క్యారెక్టర్ చేసినట్లున్నాడు జగపతి.

దీపావళికి కోలీవుడ్లో విపరీతమైన పోటీ ఉంది. ధనుష్ ?కోడి?.. కార్తి ?కాష్మోరా?.. విజయ్ ఆంటోనీ ?సైతాన్? ఈ పండక్కే రాబోతున్నాయి. వాటి మీద భారీ అంచనాలున్నాయి. వాటితో పోలిస్తే రొటీన్ సినిమాలాగా కనిపిస్తోంది ?కత్తి సెండై. యాక్షన్ సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడైన సూరజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. తెలుగులోనూ ఈ చిత్రం ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. తమన్నా.. జగపతి ఉండటం తెలుగు వెర్షన్ కు కలిసొచ్చే అంశం.

,  ,  ,  ,  ,  ,