Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Jun-2017 12:19:30
facebook Twitter Googleplus
Photo

తెలుగుతో పాటు దక్షిణాదిలోని అన్ని భాషల్లోను విడుదల కానున్న ఈ చిత్రంలో.. సావిత్రి పాత్రలో మలయాళీ భామ కీర్తి సురేష్ కనిపించనుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కాగా.. కీర్తిపై ఇప్పటికే ఓ పాట చిత్రీకరణ కూడా పూర్తయిపోయింది. మరోవైపు దుల్కర్ సల్మాన్ కూడా రీసెంట్ గా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు.

అయితే.. సావిత్రి పాత్ర కోసం కీర్తి సురేష్ బరువు పెరుగుతోందనే రూమర్స్ కొంత కాలంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు వీటిపై ఈ భామ ఫుల్లు క్లారిటీ ఇచ్చేసింది. సావిత్రి పాత్ర కోసం బరువు పెరగడం అనే పాయింట్ పై ఓపెన్ గానే చెప్పేసింది కీర్తి సురేష్. నిజంగా చెప్పాలంటే.. నేను ఈ పాత్ర కోసం బరువు పెరగడం లేదు. ఇంకా చెప్పాలంటే గత కొంత కాలంగా నేను వెయిట్ తగ్గించుకుంటున్నాను కూడా. అయితే.. సావిత్రి పాత్రలో ఒదిగిపోయేందుకు గాను.. ప్రోస్థటిక్ మేకప్ ను ఉపయోగిస్తున్నాం. అలాగ మేకప్ సహాయంతో నేను లావుగా కనిపిస్తున్నానంతే' అని చెప్పేసింది కీర్తి సురేష్.

సావిత్రి పాత్ర కోసం బరువు పెరగాల్సి ఉంటుందనే.. పలువురు టాప్ హీరోయిన్లు ఈ పాత్రలో నటించేందుకు ఒప్పుకోలేదనే టాక్ కూడా ఉంది. ఇక కీర్తి ఇతర సినిమా విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈమె పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ మూవీలో లీడ్ హీరోయిన్ గా నటిస్తుండగా.. కోలీవుడ్ హీరో సూర్య నెక్ట్స్ మూవీలో కూడా నటిస్తోంది.

,  ,  ,  ,  ,  ,