Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Sep-2016 11:28:47
facebook Twitter Googleplus
Photo

మల్లూవుడ్ బ్యూటీ కీర్తి సురేష్ కి కలిసొచ్చే కాలం.. పరిగెట్టుకుంటూ వస్తోందని అనిపిస్తోంది. పెర్ఫామెన్స్ విషయంలో వంక పెట్టడానికి ఏ మాత్రం స్కోప్ ఇవ్వని ఈ సుందరాంగి.. ఇప్పటికే బోలెడంత గుర్తింపు సంపాదించింది కానీ.. ఆమె ట్యాలెంట్ ముందు ఇది తక్కువే అంటారు సినీ జనాలు. కీర్తి విషయంలో కీర్తి సురేష్ వెనకబడ్డానికి మెయిన్ రీజన్.. ఇప్పటివరకూ స్టార్ హీరోల సరసన నటించకపోవడమే.

కానీ కీర్తికి ఆ బెంగ కూడా తీరిపోనుంది. తెలుగు.. తమిళ్.. మలయాళ సినిమాలు చేసేస్తున్న కీర్తి.. ఇప్పటివరకూ స్మాల్-మీడియం హీరోల సినిమాలతోనే సరిపెట్టేసుకుంది. తొలిసారిగా ఇండస్ట్రీ టాప్ స్టార్ తో చేసే ఛాన్స్.. కోలీవుడ్ పవర్ స్టార్ విజయ్ రూపంలో వచ్చింది. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానున్న 'భైరవ' చిత్రానికి సంబంధించి.. విజయ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తే.. ఆ పక్కనే ఈ భామను కూర్చో బెట్టేసి.. కీర్తి ఫ్యాన్స్ పోస్టర్ తయారు చేసేశారు. భైరవ ఫస్ట్ లుక్ కూడా ఇదే టైపులో ఉన్నా.. అందులో రిక్షాలో కనిపించే విజయ్.. ఈ సారి కీర్తి కోసం జీప్ ఎక్కి పోజ్ ఇచ్చినట్లుగా ఉంటుంది పోజ్. నిజానికి భైరవలో కీర్తి సురేష్ లుక్ ఇంకా రివీల్ చేయలేదు. దీపావళికి విజయ్- కీర్తి సురేష్ ల కాంబినేషన్ లో పోస్టర్ ఇస్తారట.

భైరవ రిలీజ్ కంటే ముందు.. తెలుగు నేచురల్ స్టార్ నానితో నేను లోకల్.. తమిళ్ లో ధనుష్ తో తొడరి రిలీజ్ కానున్నా.. వీటిన్నిటి కంటే బిగ్గెస్ట్ మూవీ.. పవర్ స్టార్ భైరవ. మొత్తానికి 2017 సంవత్సరం కీర్తి కెరీర్ లో మైలు రాయిగా నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

,  ,  ,  ,  ,  ,