Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Jun-2015 11:16:28
facebook Twitter Googleplus
Photo

రవితేజ .. రకుల్ ప్రీత్ సింగ్ జంటగా తెరకెక్కిన 'కిక్ 2' సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వేసవి సెలవుల్లోనే ఈ సినిమా వస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూసిన ప్రేక్షకులు ఒకింత నిరాశకి లోనయ్యారు. అలాంటి అభిమానులకి సంతోషాన్ని కలిగించడం కోసం ఈ సినిమాను ఈ నెల 19న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టుగా సమాచారం. దాదాపు ఈ తేదీ ఖరారు కావొచ్చనే అంటున్నారు.

ఎందుకంటే .. 'రుద్రమదేవి'ని ముందుగా ఈ రోజునే ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని అనుకున్నారట. అయితే ఈరోజున 'కిక్ 2' సినిమా రిలీజ్ కి సన్నాహాలు జరుగుతూ ఉండటంతో, అది ఈ నెల 26వ తేదీకి వెళ్లిందని తెలుస్తోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా అంతకుముందు వచ్చిన కిక్ ని మరిపిస్తూ డబుల్ కిక్ ఇస్తుందా? లేదా? అనేది చూడాలి.

,  ,  ,  ,  ,  ,