Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Jun-2016 11:25:11
facebook Twitter Googleplus
Photo

ఇప్పుడంటే.. నందమూరి బాలకృష్ణ పక్కా మాస్ సినిమాలకే పరిమితమవుతున్నాడు కానీ.. పాతికేళ్ల క్రితం అయితే ఎక్స్పరిమెంట్స్ చేసిన ఘనత అతనికి ఉంది. అప్పట్లో 'ఆదిత్య 369' 'భైరవ ద్వీపం' లాంటి చిత్రాలను బాలయ్య అందించి హిట్టు కొట్టాడు. అలానే 17 ఏళ్ల క్రితం వచ్చిన 'సుల్తాన్'లో హీరోగా నటిస్తూనే మరో పాత్ర కోసం కరుడుగట్టిన ప్రతినాయకుడుగానూ మెప్పించాడు. ఇలా ఎన్నో యాక్టింగ్ షేడ్స్ని చూపించిన బాలకృష్ణని ఇప్పుడు కోలీవుడ్ హీరోలు ఆదర్శంగా తీసుకుంటున్నారు. విక్రమ్.. సూర్యలాంటి హీరోలతో పాటు విజయ్ లాంటి మాస్ హీరో కూడా బాలయ్యనే ఫాలో అవుతున్నాడు.

ఇటీవల విడుదలైన '24'లో బాలకృష్ణ చేసిన రెండు పాత్రలను ఫాలో అయ్యాడు సూర్య. ఒకటి... '24 మూవీ పక్కాగా 'ఆదిత్య 369'లాగా సైంటిఫిక్ ఫిక్షన్ కాగా.. రెండోది 'సుల్తాన్ లో బాలయ్య నటించిన విలన్ పాత్రను పోలి వున్న ఆత్రేయ రోల్. ఈ రెండూ బాలయ్యవే. మరో కోలీవుడ్ హీరో విజయ్ కూడా 'పులిస చిత్రంతో బాలయ్య నటించిన జానపద చిత్రం 'భైరవద్వీపం సినిమాను ఫాలో అయ్యాడు. అలానే 'భైరవ ద్వీపం'లోని కురూపి తరహా పాత్రను ఐ లో విక్రమ్ వేశాడు. ఇందులో హీరో.. భైరవద్వీపంలోలానే హీరోయిన్ కి తన గురించి చెప్పలేని పరిస్థితి. ఇలా కోలీవుడ్ హీరోలు బాలయ్యనే ఫాలో అవుతున్నారు.

,  ,  ,  ,  ,