Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Jul-2017 17:15:48
facebook Twitter Googleplus
Photo

సినిమాలు తీసేవాళ్లకు సామాజిక బాధ్యత ఉండాలంటారు. సినిమాలు జనాలపై ప్రభావం చూపుతాయి కాబట్టి ఎంతో కొంత మంచి చెప్పే ప్రయత్నం చేయాలంటారు. ఇంకొందరేమో సినిమాలు చూసి జనాలు మారిపోరని.. మంచి సినిమాల వల్ల జనాల్లో మార్పు వచ్చిన దాఖలాలేమీ లేవని అంటారు. ఇదే విషయాన్ని సీనియర్ దర్శకుడు కృష్ణవంశీ దగ్గర ప్రస్తావిస్తే.. తన వరకు సినిమాల ద్వారా ఎంతో కొంత మంచి చెప్పాలనే చూస్తానని అన్నాడు. ఈ విషయంలో రాజీ పడనని.. తన సినిమాల్లో హీరోల పాత్రల్ని చెడుగా తీర్చిదిద్దలేనని ఆయన స్పష్టం చేశారు.

సినిమా అనేది ఒక విషయాన్ని ముప్పై రెట్లు పెద్దది చేసి చూపిస్తుందని.. కాబట్టి ఆ ప్రభావం సినిమా చూసేవాళ్లపై ఉంటుందని కృష్ణవంశీ అన్నాడు. ప్రేక్షకుడు తన డబ్బులు.. సమయం మనకు ఇస్తున్నపుడు.. మనం అతడికి తిరిగి ఏం ఇస్తున్నామనే విషయంలో బాధ్యతతో ఆలోచిస్తానని అతనన్నాడు. తన సినిమా చూసి బాగుపడకపోయినా ఫర్వాలేదు కానీ చెడిపోకూడదన్నది తన అభిమతమని.. అందుకే తన సినిమాలో కథానాయకుడిని ఎప్పుడూ దొంగగా.. జూదరిగా.. చెడు లక్షణాలున్న వ్యక్తిగా చూపించనని.. సినిమా పేర్ల విషయంలోనూ తాను జాగ్రత్తగా ఉంటానని.. హీరో ఎప్పుడూ ఉదాత్తంగా ఉండాలన్నది తన ఉద్దేశమని.. తన లీడ్ రోల్స్ ను అలాగే డిజైన్ చేస్తానని.. సినిమాలు కూడా అలాగే ఉండేలా చూసుకుంటానని.. ఈ విషయంలో తాను రాజీ పడటం.. మారడం ఉండదని కృష్ణవంశీ స్పష్టం చేశాడు.

,  ,  ,  ,