Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Dec-2017 13:17:39
facebook Twitter Googleplus
Photo

స్టార్ హీరోయిన్స్ కి గట్టిపోటిని ఇస్తోన్న హీరోయిన్స్ ఈ మధ్య బాగానే కనిపిస్తున్నారు. ముఖ్యంగా సాయి పల్లవి నటించింది మీడియం హీరోలతోనే అయినా తన ఇమేజ్ తో సినిమాను హై లెవెల్ కి తీసుకెళుతోంది. తెలుగులో ఒక్క ఫిదా సినిమాతో అమ్మడి రేంజ్ ఏ స్థాయికి పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఆ సినిమా గెలుపుతో సాయి ఇతర ఇండస్ట్రీల ఆఫర్స్ ని కూడా అందుకుంటోంది.

ఇప్పటికే కోలీవుడ్ డైరెక్టర్ ఏఎల్.విజయ్ - కణం సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే మరో స్టార్ డైరెక్టర్ సినిమాలో కూడా అవకాశం దక్కించుకుంది. అందులోనూ.. సూర్యా హీరోగా నటిస్తున్న సినిమాలో అంటే మరొక స్పెషల్ అని చెప్పాలి. 7/G బృందావన కాలిని - ఆడవారిమాటలకు అర్దాలే వేరులే - యుగానికి ఒక్కడు వంటి హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన కోలీవుడ్ డైరెక్టర్ సెల్వరాఘవన్ ఆ సినిమాను తెరకెక్కించబోతున్నాడు.

ఇక ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా మరో హీరోయిన్ గా నటించబోతోంది. గత నెలలో ఖాకీ ప్రమోషన్స్ లో రకుల్ ఈ విషయాన్ని చెప్పింది. సాయి పల్లవితో పాటు రకుల్ క్యారెక్టర్ కూడా సమానంగా ఉండనుందట. ఆల్రెడీ తెలుగులో వీరిద్దరు హరీష్ శంకర్ డైరెక్షన్ లో మల్టీస్టారర్ లో నటిస్తున్నారని టాక్ వచ్చింది.

,  ,  ,  ,