Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Apr-2015 10:52:02
facebook Twitter Googleplus
Photo

బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం 'లయన్' మరి కాస్త ముందుకు వచ్చింది. మొదట్లో ఈ చిత్రాన్ని మే 1న రిలీజ్ చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలొచ్చాయి. ఇప్పుడు ఏప్రిల్ 30న విడుదల చేయడానికి నిర్ణయించినట్టు తాజా సమాచారం. వివిధ సినిమాల విడుదల తేదీలను దృష్టిలో పెట్టుకుని ఈ స్వల్ప మార్పు చేసినట్టు చెబుతున్నారు. నూతన దర్శకుడు సత్యదేవా దర్శకత్వం వహిస్తున్న ఈ 'లయన్' చిత్రంలో త్రిష, రాధికా ఆప్టే కథానాయికలుగా నటిస్తున్నారు. బాలకృష్ణ నటించిన 'లెజండ్' వంటి సూపర్ హిట్టు తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాకి చాలా క్రేజ్ వచ్చింది.

,  ,  ,  ,  ,  ,