Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Dec-2017 10:46:14
facebook Twitter Googleplus
Photo

పాటలో సావిత్రి హావభావాలు కూడా పాటను అందంగా మార్చయి. అలాంటి సావిత్రి పాటలు సినిమాలు సినిమా ఇండస్ట్రీ బ్రతుకున్నంత కాలం పదిలంగా ఉంటాయి. కానీ ఈ తరం వారికి ఆ అందాల జాబిలిని చూపించాలిగా.. అదే తెరపై చూపించాలని ఓసారి గుర్తు చేస్తున్నాడు నేటి యువతరం దర్శకుడు నాగ్ అశ్విన్.

సావిత్రి జీవిత ఆధారంగా మహానటి సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి దర్శకుడు ఎక్కువగా బయటకి ఏ విషయాన్ని అధికారికంగా రిలీజ్ చేయడం లేదు. ముఖ్యంగా ఆ కాలం నాటి నటీనటుల పాత్రలను ఎవరు చేస్తున్నారన్నది సినిమాకు చాలా ముఖ్యం. మొదటి నుంచి పాత్రలను చిత్ర యూనిట్ వర్గాల నుండి ఎవరో ఒకరు లీక్ చేస్తూ వస్తున్నారు. నిర్మాత దర్శకుడు అనుకుంటే వాటిని సీక్రెట్ గా ఉంచడం పెద్ద పనేమీ కాదు. కానీ అందరికి తెలిసిపోయాయి. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోన్న సంగతి ముందుగా అందరికీ చెప్పారు. ఇక కొందరి యాక్టర్స్ ను సెలెక్ట్ చేసినట్టు కూడా ఎవరికి చెప్పలేదు. ముఖ్యంగా సమంత నటిస్తుంది అన్నారు కానీ ఆమె ఎవరి పాత్ర చేస్తుంది అనే విషయాన్ని ముందుగా చెప్పలేదు. కానీ రీసెంట్ గా కీర్తి సురేష్.. సమంత చేస్తోంది జమున పాత్ర అని డైరెక్ట్ గా చెప్పేసింది. ఇక ఎస్వీ.రంగారావు గారి పాత్రను మోహన్ బాబుగారు చేస్తున్నారని తెలిసిపోయింది.

ఇక అసలు విషయానికి వస్తే ఎవరు ఏ పాత్రలు చేసిన ఒకే కానీ సావిత్రి తో ఎన్నో హిట్ సినిమాలను చేసిన నందమూరి తారకరామారావు అలాగే అక్కినేని నాగేశ్వరరావు పాత్రలను ఎవరు చేస్తున్నారన్నది సినిమాకు చాలా ప్లస్ పాయింట్. మొదట ఈ పాత్రలను వారి వారసులు బాలకృష్ణ - నాగార్జున చేస్తున్నారని చెప్పారు. కానీ అందులో నమ్మడానికి ఒక పాయింట్ కూడా దొరకలేదు. ఇక వారి లేటెస్ట్ వారసులు యువ హీరోలు జూనియర్ ఎన్టీఆర్ - నాగ్ చైతన్య చేస్తున్నారని కూడా టాక్ బాగా వచ్చింది. ఎన్టీఆర్ చేస్తే తప్పకుండా తాను చేస్తానని చైతు చెప్పగా.. తారక్ కూడా మొదట ఒకే చెప్పి తర్వాత కుదరదు అన్నాడని వార్తలు వచ్చాయి.

ఈ తరహా న్యూస్ లు ఎన్ని వచ్చినా కొంచెం న్యాయంగా మాట్లాడుకోవాలంటే.. సావిత్రి లాంటి సినిమా మళ్లీ మళ్లీ రాదు. అలాంటి సినిమాల్లో వారి పెద్దల పాత్రలను ఆ కుటుంబ సభ్యులలోని హీరోలు చేస్తేనే అందంగా ఉంటుంది. కానీ మన నటులు ఎదో ఒక కారణం చెప్పి వారి స్టార్ ఇమేజ్ గురించి ఆలోచించి వెనుకడుగు వేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది వారికే తెలియాలి

,  ,  ,  ,  ,  ,