Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Sep-2016 15:50:17
facebook Twitter Googleplus
Photo

కెరీర్లో సరైన హిట్ లేక ఇబ్బందిపడుతున్న యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం కృష్ణ వంశీ దర్శకత్వంలో నక్షత్రం అనే సినిమా చేస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. అయితే సందీప్ ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాల్ని డూప్ లేకుండా తానే స్వయంగా చేస్తున్నాడట. అంతేగాక కృష్ణ వంశీ సలహా మేరకు కొని సన్నివేశాల్లో నేచ్యురల్ లుక్ కోసం మేకప్ లేకుండానే నటిస్తున్నాడట.
అలాగే ఓ భారీ కార్ ఛేజింగ్ సన్నివేశాన్ని ఎటువంటి అదనపు భద్రతలు లేకుండా చేశాడట. ఇందులో కార్లన్నీ 150 కి. మీ వేగంతో వెళుతుంటే సందీప్ తన కారుతో వాటికి ఎదురుగా వెళతాడట. ఈ సన్నివేశం సినిమాలో హైలెట్ గా ఉంటుందని కూడా తెలుస్తోంది. ఈ యాక్షన్ స్టంట్స్ చేసేటప్పుడు మొదట్లో చిన్న చిన్న గాయాలు తగిలినా వెనక్కు తగ్గకుండా పెర్ఫార్మ్ చేశాడట సందీప్. ఇకపోతే ఈ చిత్రంలో రెజీనా హీరోయిన్ గా నటిస్తుండగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్ లు అతిధి పాత్రలో నటిస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,