Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Aug-2017 10:48:55
facebook Twitter Googleplus
Photo

ఎప్పుడో రాజకుమారుడు సినిమాతోనే మహేష్ బాబును లాంచ్ చేశారుగా.. అప్పటినుండి మనోడు ఇరగదీస్తూ వస్తూ ఇప్పుడు సూపర్ స్టార్ కూడా అయిపోయాడు. మరి ఇప్పుడు కొత్తగా లాంచ్ చేయడం ఏంటి? అక్కడే మనం నమ్రత శిరోద్కర్ స్ర్టాటజీలను గుర్తించాలి. ఔరా అనుకోవాలి. అదిగో ఇప్పుడు సెప్టెంబర్ 9న చెన్నయ్ లో జరగబోయే వేడుకే అందుకు నిదర్శనం కాబోతుంది.

మహేష్ బాబు కేవలం తెలుగులోనే సినిమాలు చేస్తాడనే సంగతి తెలిసిందే. బాలీవుడ్ గురించి అడిగితే ఇక్కడే చేయాల్సింది చాలా ఉందండీ అంటూ చాలాసార్లు చెప్పాడు. కాని ఇప్పుడు మాత్రం తన సినిమాల బడ్జెట్లు కూడా పెరిగిపోతుండటంతో.. తనకు ధారాళంగా మాట్లాడటం కూడా వచ్చిన తమిళ ఇండస్ర్టీపై గ్రిప్ పెంచుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అందుకే 'స్పైడర్' సినిమాను ఒక బైలింగువల్ గా రెండు బాషల్లోనూ రూపొందించారు. ఈ సినిమాకు సంబంధించి ఒక ప్రీ-రిలీజ్ ఈవెంట్ తరహాలో ప్లాన్ చేసి.. అక్కడ మహేష్ బాబును ఒక కొత్త హీరో తరహాలో తమిళ్ లో కూడా లాంచ్ చేస్తారట. సెప్టెంబర్ 9న జరిగే ఆ ఈవెంటుకు తమిళనాట చాలామంది పెద్దలు రావడమే కాదు.. అసలు స్టేజ్ దగ్గర నుండి మహేష్ ఎంట్రీ వరకు అన్నీ అదిరిపోతాయ్ అంటున్నారు.

చూస్తుంటే రానున్న రోజుల్లో మహేష్ ప్రతి సినిమానూ తెలుగు అండ్ తమిళ్ బాషల్లో కానిచ్చేశేలా ఉన్నాడు

,  ,  ,  ,  ,