Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Mar-2017 10:43:59
facebook Twitter Googleplus
Photo

బాహుబలి 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్లో మాంచి ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. ఎందుకంటే అక్కడ ఎప్పుడూ చూపించిన రసికరత్న యాంగిల్ చూపించేశారు. ఓసారి ఒక లుక్కేద్దాం పదండి.

నిజానికి ఈ ఈవెంట్ స్టేజీపై మాట్లాడటానికి సీనియర్ నటుడు కృష్ణంరాజు వచ్చినప్పుడు.. ఆయన వయస్సు పైబడిన రిత్యా.. మెట్లు ఎక్కడానికి చాలా ఇబ్బందే పడ్డారు. అయితే ఆయన్ను స్టేజీ ఎక్కించడానికి ప్రభాస్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆయన చేయికి తన భుజాన్ని కాపుకాసి.. ప్రభాస్ తన పెదనాన్నను స్టేజ్ ఎక్కించేశాడు. ఇక ఇదే విషయం పై ప్రస్తావించిన రాఘవేంద్రరావు.. యాంకర్ సుమతో ఒక జోక్ వేశారు. ''అక్కడ కృష్ణంరాజును పైకి తీసుకురావడానికి ప్రభాస్ వచ్చాడు కదా.. మరి నాకోసం అనుష్క.. తమన్నా వస్తే బాగుండేదిగా అనేశారు దర్శకేంద్రుడు.

అయితే రాఘవేంద్రరావు స్టేజీ దిగి వెళ్తున్నప్పుడు.. అనుష్కా నువ్వు వస్తే బెటర్ అని సుమ చెప్పడంతో.. అనుష్క నిజంగానే ఆయన్ను మెట్లు దించడానికి సాయం చేసింది. ఆమె వెనుకనే తమన్నా కూడా పరిగెత్తుకుంటూ వచ్చేసింది. మొత్తానికి అటూ ఇటూ ఇద్దరి భామలతో రాఘవేంద్రరావు రసికరత్నంగా మెట్లు దిగేశారు.

,  ,  ,  ,  ,  ,