Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Aug-2015 17:31:06
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన అభిమానులకు ఎప్పటికప్పుడు సూపర్బ్ ఎంటర్టైన్ సినిమాలను అందించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా కథలో కూడా ఓ కొత్తదనం ఉండేలా చూసుకుంటాడు. మహేష్ బాబు టాలీవుడ్ లో ఎన్నో డిఫరెంట్ సినిమాలను ట్రై చేసాడు. అదే బాటలోనే లేటెస్ట్ గా అవుట్ అఫ్ బౌండరీస్ చేసిన సినిమా ?శ్రీమంతుడు?. ఎందుకు అవుట్ అఫ్ బౌండరీస్ అన్నాను అంటే టాలీవుడ్ లో ఎక్కువ శాతం టిపికల్ కమర్షియల్ కథలకే ఒటేస్తున్నారు. కానీ మహేష్ మాత్రం ఆ ఫ్లేవర్ నుంచి బయటకి వచ్చి ఓ బర్నింగ్ సోషల్ మెసేజ్ ని తీసుకొని దాన్ని కమర్షియల్ గా చెప్పడానికి ట్రై చేసాడు.
జస్ట్ ట్రై మాత్రమే కాదు అనుకున్నదానికంటే ఎక్కువగా సక్సెస్ అయ్యాడు. శ్రీమంతుడు సినిమాలో సినిమా చూసే ప్రేక్షకులకు ఏమేమి కావాలో చూసుకుంటూనే అనుకున్న మెసేజ్ ని కూడా ఆడియన్స్ ని పర్ఫెక్ట్ గా రీచ్ చేసారు. దీంతో మహేష్ బాబు ప్రెజంట్ సెన్సేషన్ గా నిలవడమే కాకుండా ఇలాంటి అటెంప్ట్ చేసిననందుకు టాక్ అఫ్ ది టాలీవుడ్ గా మారాడు. ముఖ్యంగా శ్రీమంతుడు విషయంలో కొరటాల శివ ఓ డైరెక్టర్ గా డబుల్ సక్సెస్ అయ్యాడు. కేవలం ప్రశంశలే కాదు బాక్స్ ఆఫీసు వద్ద కూడా రికార్డ్ కలెక్షన్స్ సృష్టిస్తోంది. శ్రీమంతుడు సినిమా తెలుగు ప్రేక్షకులను, సినీ వర్గాలను, విమర్శకులను మాత్రమే కాదు ఫేమస్ పొలిటీషియన్స్ కూడా ఈ సినిమాని చూసి ప్రశంశిస్తున్నారు.
నిన్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, తెలంగాణ ఐటి మినిస్టర్ కేటిఆర్ లు కూడా ఈ చిత్ర టీం మరియు మహేష్ బాబులపై ప్రశంశలు కురిపించారు. మన గ్రామాలను మనమే దత్తత తీసుకొని డెవలప్ చెయ్యాలని చెప్పిన విధానం అద్భుతంగా ఉందని వారు కితాబులిచ్చారు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.

,  ,  ,  ,