Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Oct-2015 17:42:37
facebook Twitter Googleplus
Photo

తెలుగులో ఇద్దరు అగ్ర హీరోలైన సూపర్ స్టార్ మహేష్ బాబు - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు కలసి ఓ మల్టీ స్టారర్ మూవీలో నటిస్తే..? ఆ ఊహ ఎంత బాగుందో కదూ!. చాలా మంది తెలుగు ప్రేక్షకుల కోరిక కూడా ఇదే. వాళ్ళ కోరిక ఎన్నటికి నెరవేరుతుందో చెప్పడం కష్టం. ప్రేక్షకులే కాదు దర్శకులూ అలాంటి సినిమాను కోరుకుంటున్నారు. తాజాగా దర్శకుడు శ్రీను వైట్ల కూడా వారిద్దరితో సినిమా తీయడం తన కల అని చెప్పారు.

పవన్ కళ్యాణ్ - బాలకృష్ణ మినహా తెలుగులో దాదాపు అందరు అగ్ర హీరోలతో శ్రీనువైట్ల సినిమాలు చేశారు. ఒకవేళ మీరు మల్టీస్టారర్ మూవీ తెరకేక్కించాలంటే.. హీరోలుగా ఎవరిని ఎంపిక చేసుకుంటారు అని ప్రశ్నించగా.. పవన్ - మహేష్ అని ఠక్కున సమాధానం ఇచ్చారు. వాళ్లిద్దరితో మల్టీ స్టారర్ నా కల అని చెప్పారు. శ్రీనువైట్ల స్వప్నం నెరవేరాలని ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు.

మహేష్ బాబుతో 'దూకుడు' వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు శ్రీనువైట్ల. యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ సినిమాలకు తెలుగులో కేరాఫ్ అడ్రస్ శ్రీనువైట్ల. గతంలో 'ఆనందం' లాంటి చక్కటి ప్రేమకథా చిత్రం కూడా తీశారు. అగ్ర దర్శకుడి హోదా లభించిన తర్వాత భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే తీస్తూ వచ్చారు. తాను నిర్మాతగా మారితే ఆనందం లాంటి సినిమాను తీస్తానని శ్రీనువైట్ల చెబుతున్నారు.

మరోవైపు మల్టీస్టారర్లకు మహేశ్ వ్యతిరేకమేమీ కాదు. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఆయన వెంకటేశ్ తో కలిసి నటించారు. ఈ నేపథ్యంలో శ్రీను వైట్ల లాంటి అగ్రశ్రేణి దర్శకులు ఒప్పించగలిగితే పవన్ - మహేశ్ ల కాంబినేషన్ ప్రేక్షకులకు ఆనందం పంచొచ్చు. ఆ కాంబినేషన్ తన కల అని చెబుతున్న శ్రీను వైట్ల దాన్ని ఎప్పుడు నిజం చేసుకుంటారు.. ప్రేక్షకుల కోరిక ఎప్పుడు తీరుస్తారు.. అసలు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారా అన్న ప్రశ్నలకు మాత్రం శుభంకార్డు పడలేదు.

,  ,  ,