Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-May-2016 16:49:12
facebook Twitter Googleplus
Photo

విలక్షణ నటుడు మోహన్ బాబు కుమార్తెగా సినీ రంగంలో ప్రవేశించిన మంచు లక్ష్మి.. విభిన్న పాత్రలను పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుటోంది. లక్ష్మి సినిమాలో ఉందంటే.. ఖచ్చితంగా అదో డిఫరెంట్ కేరక్టర్ అయుంటుంది అని ప్రేక్షకులు అనుకునే స్థాయిలో గుర్తింపు పొందింది. ఇప్పుడు ఈమె ప్రధాన పాత్రలో ఓ కొత్త సినిమా ప్రారంభమైంది. టైటిల్ తోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న మంచు లక్ష్మి కొత్త సినిమా పేరు.. 'లక్ష్మీ బాంబ్'.

లక్ష్మీ బాంబ్.. జనాలకు బాగా తెలిసిన పేరు. దీపావళి టపాసులు అనగానే టక్కున గుర్తొచ్చేస్తుంది. అలాంటి టైటిల్ తో ఓ పవర్ ఫుల్ మూవీ చేస్తున్నట్లు చెబుతోంది మంచు లక్ష్మి. 'ఒక యాక్టర్ గా నేను ఇప్పటివరకూ చేసిన రోల్స్ కి.. లక్ష్మి బాంబ్ లో చేసే పాత్రకు చాలా తేడా ఉంటుంది. ఈ సినిమాలో నేను ఓ పవర్ ఫుల్ జడ్జ్ పాత్రలో కనిపిస్తాను. కార్తికేయ గోపాలకృష్ణ చెప్పన కథ విపరీతంగా నచ్చేసింది. సినిమా ప్రారంభం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను' అంటోంది మంచు లక్ష్మి.

'లక్ష్మీ బాంబ్' చిత్రానికి పూజా కార్యక్రమాలతో పాటు ముహూర్తం షాట్ కూడా చిత్రీకరించారు. మంచు విష్ణు - మనోజ్ ఈ కార్యక్రమానికి హాజరవగా.. విష్ణు తొలిషాట్ కు క్లాప్ కొట్టాడు. కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న లక్ష్మీ బాంబ్ చిత్రానికి.. ఫ్రం శివకాశి అనే ట్యాగ్ లైన్ కూడా ఉందండోయ్.

,  ,  ,  ,  ,