Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Sep-2016 11:56:52
facebook Twitter Googleplus
Photo

దర్శకుడు మారుతి ఇప్పుడు కొత్త స్కూల్ లోకి వచ్చేశాడు. రచయితగా ఇంకా పూర్తిగా తనకు ఫేమ్ తీసుకొచ్చిన డబుల్ మీనింగ్ జోనర్ ని వదిలిపెట్టకపోయినా.. తను డైరెక్ట్ చేసే సినిమాల్లో మాత్రం క్లీన్ కామెడీని అందిస్తూ ఆకట్టుకుంటున్నాడు. నానితో భలేభలే మగాడివోయ్ చిత్రంతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న మారుతి.. రీసెంట్ గా వెంకటేష్ తో బాబు బంగారంను అందించాడు.

సాధారణంగా మేకింగ్ లో సూపర్ స్పీడ్ చూపించడం మారుతి స్టైల్. కానీ బాబు బంగారం విడుదలయ్యి నెలన్నర దాటిపోయినా ఇంకా నెక్ట్స్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయలేదు. అక్కినేని అఖిల్ తోను.. మాస్ మహరాజ్ రవితేజ తోను సినిమాలు అనుకున్నా అవి పట్టాలెక్కలేదు. అఖిల్ ఇప్పుడు విక్రమ్ కె. కుమార్ కి కమిట్ అయ్యాడు. మరోవైపు రవితేజ కూడా వేరే ప్రాజెక్టులు స్టార్ట్ చేసేస్తున్నాడు. దీంతో మారుతి మూవీ ఎవరితో అనే విషయంపై ఇంకా సస్పెన్స్ వీడలేదు.

ఇప్పుడీ డైరెక్టర్ దగ్గర ఉన్నది రెండే ఆప్షన్స్. పెద్ద హీరోతో మూవీ ఫిక్స్ అయ్యేలోపు ఎవరైనా చిన్న హీరోతో సినిమా చేయడం. లేదా భారీ ప్రాజెక్ట్ సెట్ అయ్యేవరకూ వెయిట్ చేయడం. మారుతి ఇఫ్పుడు రెండో ఆప్షన్ కే మొగ్గుతున్నాడని తెలుస్తోంది. మరికొంత కాలం వేచి చూడాలనే అనుకుంటున్నాడట మారుతి.

,  ,  ,  ,  ,  ,