Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Oct-2016 17:33:24
facebook Twitter Googleplus
Photo

కింగ్ ఆఫ్ సినిమా.. ఎప్పుడైతే బ్యాక్ టు సినిమా అన్నారో.. అప్పుడే ప్రకంపనలు మొదలైపోయాయ్. అయితే తన 150వ సినిమాను చాలా లేటుగా మొదలెట్టిన మెగాస్టార్ చిరంజీవి.. పూర్తి చేయడంలో మాత్రం యమా స్పీడు చూపిస్తున్నారు. ఊహించని రీతిలో వరుస షెడ్యూల్స్ లో షూటింగ్ చేసుకుంటూ పోతూ.. 2017 సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

నిన్నగాక మొన్న యాక్షన్ సన్నివేశాల షూటింగ్ లో పాల్గొన్న చిరంజీవి.. తరువాత వెంటనే ఐటెం సాంగ్ షూటింగ్ లో లారెన్స్ పర్యవేక్షణలో స్టెప్పులు వేసి అదరగొట్టారు. వెనువెంటనే క్యాథరీన్ త్రెసాను రీప్లేసి చేసి.. లక్ష్మీ రాయ్ ను ఆ స్థానంలో దించేసి.. ఆ పాటను అనుకున్నట్లే పూర్తి చేసేశారు. అయితే ఇప్పుడు మెగాస్టార్ మరో రెండు రోజుల్లో యురోప్ వెళ్తున్నారు. ఇప్పటికే అక్కడ చాలా కంట్రీస్ లో షూటింగ్ చేసిన చిరు.. ఈసారి యుక్రెయిన్ దేశంలోని ఆందమైన లొకేషన్లలో పాటలు తీస్తే బాగుంటుందని ఫిక్సయ్యారట. అక్కడే ఆయన రెండు పాటల కోసం సెక్సిణి కాజల్ అగర్వాల్ ను రొమాన్స్ చేయనున్నారు.

మొత్తానికి చాలా సంవత్సరాల తరువాత చిరంజీవి మరోసారి యుగళ గీతంలో మెరస్తున్నారనమాట. ఇక్కడ అదే హైలైట్. అందాలో కాజల్ చంపేస్తుంది సరే.. వాటి పక్కనే తన చిందులో మెగాస్టార్ ఎలా ఉర్రూతలూగిస్తారు అనే విషయం చూడ్డానికి అందరూ వెయ్యి కళ్ళతో వెయిట్ చేస్తున్నారు. అది సంగతి.

,  ,  ,  ,