Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Oct-2015 15:36:25
facebook Twitter Googleplus
Photo

ఒక్క టైటిల్ సాంగ్ మినహా షూటింగ్ అంతా పూర్తయింది. త్వరలోనే ఫినిష్ చేసేస్తాం.. ఇది బ్రూస్ లీ ఆడియో వేడుకలో రామ్ చరణ్ చెప్పిన మాట. అక్టోబర్ 7నాటికి షూటింగ్ పార్ట్ ఫినిష్ చేస్తాం.. ఇదీ ఓ వారం క్రితం యూనిట్ చెప్పిన సంగతి. రెండింటినీ నిలబెట్టుకునేందుకు బ్రూస్ లీ యూనిట్ ఎంత కమిట్ మెంట్ తో కష్టపడుతోందో తెలుసుకుంటే ఆశ్చర్యం వేయక మానదు.

రిలీజ్ చేస్తామని చెప్పిన డేట్ అంటే అక్టోబర్ 16న థియేటర్లలో ఉండేందుకు.. కరెక్ట్ గా ఇంకా పది రోజుల టైం మాత్రమే ఉంది. అందుకే షూటింగ్ లో ఏ చిన్న విషయాన్ని నెగ్లెక్ట్ చేయడం లేదు. ఇవాళ ఉదయంతో బ్రూస్ లీ టైటిల్ సాంగ్ పిక్చరైజేషన్ పూర్తయిపోయింది. ఇందుకోసం 24 గంటలపాటు కంటిన్యూగా షూటింగ్ నిర్వహించారు. అంటే అక్టోబర్ 5 ఆదివారం ఉదయం 7 నుంచి మరుసటి రోజు ఉదయం 7 గంటలపాటు కంటిన్యూగా షూటింగ్ లో పాల్గొన్నారు రామ్ చరణ్ - రకుల్ ప్రీత్ సింగ్. ఫిక్స్ అయిన డేట్ కి వచ్చేందుకు.. ఇంతగా కష్టపడుతున్న ఈ యూనిట్ ని.. టాలీవుడ్ జనాలు ప్రశంసిస్తున్నారు. రకుల్ ప్రీత్ - రామ్ చరణ్ కమిటైతే.. కంప్లీట్ అయ్యేవరకూ వదిలిపెట్టకపోవడంపై యూనిట్ కూడా ఆశ్చర్యపోయింది.

స్టార్ట డమ్ ఉండి కూడా.. ఇంతగా మాటకు కట్టుబడ్డంపై చెర్రీని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఇక పోస్ట్ ప్రొడక్షన్ - మిక్సింగ్ కార్యక్రమాలు డైరెక్టర్ - తమన్ చూస్కుంటే... ప్రమోషన్ యాక్టివిటీస్ లోకి చరణ్ - రకుల్ దిగిపోతారన్నమాట. మరో 2-3 రోజుల్లో భారీ ఎత్తున పబ్లిసిటీ కార్యక్రమాలు ప్లాన్ చేసింది బ్రూస్ లీ యూనిట్.

,  ,  ,