Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Sep-2016 11:59:45
facebook Twitter Googleplus
Photo

నేచురల్ స్టార్ నానితో కలిసి కృష్ణగాడి వీర ప్రేమగాధలో నటించిన మెహ్రీన్ కౌర్ పీర్జాడా.. యాక్టింగ్ పరంగా మంచి మార్కులనే వేయించుకుంది. లుక్స్ విషయంలో కూడా అమ్మడికి ప్రశంసలు బాగానే దక్కాయి. దీంతో మల్లిడి వేణు డైరెక్షన్ లో రూపొందుతున్న అల్లు శిరీష్ సినిమాలో నెక్ట్స్ మూవీలో హీరోయిన్ ఛాన్స్ వచ్చింది. ఇప్పుడీ భామకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బంపరాఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

హరీష్ శంకర్ డైరెక్టర్ గా రూపొందనున్న డీజే.. దువ్వాడ జగన్నాథంలో హీరోయిన్ గా మొదట కాజల్ ని అనుకున్నారు బన్నీ- నిర్మాత దిల్ రాజు. ఆమెతో ఒకటి రెండు సార్లు డిస్కషన్స్ కూడా జరిగాయి. కానీ సైన్ చేసేందుకు కాజల్ చెప్పిన ఫిగర్ చూసి.. వీళ్లకు కళ్లు తిరిగాయట. హీరోయిన్ కోసం భారీగా వెచ్చించేందుకు సిద్ధంగా లేని డీజే టీమ్.. కొత్త హీరోయిన్ అయినా పర్లేదనుకుని.. మెహ్రీన్ కి ఆ ఆఫర్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. అలా బన్నీ-శిరీష్.. అన్నాదమ్ములిద్దరూ ఒకేసారి ఒకే అమ్మాయికి ఫిక్స్ అయ్యారు. ఈ మధ్య కాలంలో బన్నీ కొత్త హీరోయిన్లకు ఛాన్స్ ఇవ్వడం ఇదే అని చెప్పాలి.

అయితే.. మెగా టీమ్ లో ఒకరితో చేసే ఛాన్స్ వస్తే.. మిగిలిన హీరోలు కూడా ఆఫర్స్ ఇస్తూ ఉంటారనే టాక్ ఉంది. అది నిజమే కూడా. అలా శిరీష్ తో మొదలు పెట్టిన మెహ్రీన్.. ఇప్పుడు స్టైలిష్ స్టార్ తో చేసే ఛాన్స్ దక్కించుకుంది. బన్నీ ఇచ్చిన బంపరాఫర్ ను యూజ్ చేసుకుని.. దువ్వాడ జగన్నాధంతో సత్తా చాటితే.. మెగా హీరోయిన్ స్టాంప్ వేయించుకుని వరుసగా సినిమాలు పట్టేయచ్చు. మెగా టీమ్ లో సినిమా ఛాన్స్ అంటే ఎలా ఉంటుందో.. ఇప్పుడీ భామకు బాగానే అర్ధమయుండచ్చు.

,  ,  ,  ,  ,  ,