Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Oct-2017 14:02:35
facebook Twitter Googleplus
Photo

రోజుల్లో చాలా వరకు హీరోయిన్స్ పాత్రలు సినిమాల్లో అంతగా పాపులర్ అవ్వడం లేదు. ముఖ్యంగా కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్స్ ఎవరున్నా ఒకే అనిపిస్తోంది. కేవలం కొన్ని సినిమాల్లో గ్లామర్ కోసమే వాడుకుంటున్నారు. ఇక హీరోయిన్స్ కూడా సినిమా అవకాశాల కోసం వారికంటూ ఒక గుర్తింపు తెచ్చుకునేలా అందాలను మెయింటైన్ చేస్తున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మరీనా భామ మెహ్రీన్ పిర్జద. అమ్మడికి కృష్ణ గాడి వీర ప్రేమగాధ హిట్టు అలా వచ్చిందో లేదో వరుసగా సినిమాలను ఒకే చేసింది. మరొక ముఖ్యమైన విశేషం ఏమిటంటే.. మొదటి సినిమా హిట్ ఇప్పుడు ఆరు సినిమాలకి సైన్ చేసింది. మొన్ననే మహానుభావుడు సినిమాతో హిట్ అందుకున్న ఈ భామ లేటెస్ట్ మూవీ రాజా ది గ్రేట్ తో కూడా పర్లేదని అనిపించుకుటోంది. ఇక అమ్మడు మరో చందమామ అని మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. కొన్ని డ్రెస్సులు వేసినప్పుడు కాజల్ లా ఉంటుందని గుర్తు చేస్తున్నారు. విశేషం ఏంటంటే.. రీసెంట్ గా అమ్మడు కాజల్ కి వచ్చిన ఆఫర్ ని తను లాగేసుకుంది. వెంకటేష్ హీరోగా తేజ దర్శకత్వంలో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ తరహాలో సినిమా తెరకెక్కనుంది. మొదట హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ని అనుకున్నారట కానీ ఆమెకి డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో వెంకటేష్ తో రొమాన్స్ చేసేందుకు మెహ్రీన్ ని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం మరో నాలుగు సినిమాలతో మెహ్రీన్ బిజీగా వుంది.

,  ,  ,  ,  ,