Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Nov-2017 11:15:00
facebook Twitter Googleplus
Photo

కృష్ణగాడి వీరప్రేమ గాథ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది నార్త్ బ్యూటీ మెహ్రీన్. కమర్షియల్ హీరోయిన్ కు ఉండాల్సిన క్వాలిటీలన్నీ ఉండటంతో బాగానే ఆకట్టుకుంది. కానీ దాదాపు ఏడాది వరకు మళ్లీ వెండితెరపై దర్శనమే ఇవ్వలేదు. శర్వానంద్ హీరోగా నటించిన మహానుభావుడు తర్వాత అమ్మడి సినిమాలన్నీ క్యూ కట్టినట్టుగా థియేటర్లకు వచ్చాయి. రవితేజ హీరోగా నటించిన రాజాది గ్రేట్ థియేటర్లలో ఉండగానే సందీప్ కిషన్ హీరోగా తెలుగు-తమిళ భాషల్లో ఒకేసారి వచ్చిన కేరాఫ్ సూర్య రిలీజైంది.

నాపేరు శివ ఫేం సుశీంద్రన్ డైరెక్షన్ లో వచ్చిన కేరాఫ్ సూర్య ఫర్వాలేదనే టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా సెకండాఫ్ నుంచే బాగుందని.. ఫస్టాఫ్ లో సాగదీత ఎక్కువై బోర్ కొట్టేలా సాగిందంటూ విమర్శలొచ్చాయి. ఫస్టాఫ్ లో సందీప్ కిషన్ - మెహ్రీన్ మధ్య రొమాంటిక్ ట్రాక్ కూడా ఏమంత ఆకట్టుకునేలా లేదని పెదవి విరిచేస్తున్నారు. దీంతో సినిమా టీం రంగంలోకి ఫస్టాఫ్ లో కొంత పార్ట్ కు కోత పెట్టేసింది. ఆల్రెడీ తమిళ వెర్షన్ లో 20 నిమిషాలకు పైగా రన్ టైం తగ్గించేశారు. సినిమా లెంగ్త్ తగ్గించిన మాట వాస్తవమేనని డైరెక్టర్ సుశీంద్రన్ అంటున్నాడు. ‘‘సినిమా లెంగ్తీగా అనిపించిందనే మాట చాలామంది నోట వచ్చింది. స్క్రీన్ ప్లే ఆకట్టుకునే విధంగా ఉండటానికి హీరోయిన్ ఉన్న ఎపిసోడ్స్ తగ్గించాం అంటూ చెప్పుకొచ్చాడు.

గ్లామర్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవడానికి మెహ్రీన్ కిందామీదా పడుతోంది. ఈమధ్య వచ్చిన సినిమాలన్ని బాగున్నాయని టాక్ వచ్చినా మెహ్రీన్ లుక్ బాగుందన్న ప్రశంసలేమీ రాలేదు. తాజాగా వచ్చిన కేరాఫ్ సూర్యలో అసలే హీరోయిన్ ప్రాధాన్యం చాలా తక్కువ. అ

,  ,  ,  ,  ,  ,  ,